Chetan Kumar Arrested: హిందుత్వం మీద అభ్యంతరకర ట్వీట్ చేశాడంటూ కన్నడ యాక్టర్ అరెస్ట్
నటుడు చేతన్ కుమార్ను బెంగళూరులోని శేషాద్రిపురం పోలీస్ స్టేషన్ కస్టడీకి తరలించారు. అతడిని తొందరలోనే కోర్టులో హాజరుపర్చనున్నట్లు పోలీసులు తెలిపారు. మత విశ్వాసాలను కించపర్చడం, రెండు సమూహాల మధ్య అల్లర్లు రేకెత్తించే విధంగా ప్రవర్తించడం కింద కేసులు నమోదు చేశారు. కాగా, చేతన్ నటుడే కాకుండా దళిత, ఆదివాసీ ఉద్యమకారుడిగా పాపులర్.

Kannada Actor Chetan Kumar Arrested For 'Objectionable' Tweet On Hindutva
Chetan Kumar Arrested: హిందుత్వం మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడంటూ కన్నడ నటుడు చేతన్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం తన ట్విట్టర్ ఖాతా నుంచి హిందుత్వ వాదులు అబద్ధాలు చెప్తున్నారంటూ పలు ఉదహరణల్ని రాసుకొచ్చాడు. అయితే దీనిపై కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. మంగళవారం చేతన్ కుమార్ను అరెస్ట్ చేశారు.
నటుడు చేతన్ కుమార్ను బెంగళూరులోని శేషాద్రిపురం పోలీస్ స్టేషన్ కస్టడీకి తరలించారు. అతడిని తొందరలోనే కోర్టులో హాజరుపర్చనున్నట్లు పోలీసులు తెలిపారు. మత విశ్వాసాలను కించపర్చడం, రెండు సమూహాల మధ్య అల్లర్లు రేకెత్తించే విధంగా ప్రవర్తించడం కింద కేసులు నమోదు చేశారు. కాగా, చేతన్ నటుడే కాకుండా దళిత, ఆదివాసీ ఉద్యమకారుడిగా పాపులర్. గతంలో కూడా పలు సందర్భాల్లో హిందుత్వానికి వ్యతిరేకంగా చేతన్ వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ భావజాలం కలిగిన అతడు.. సామాజిక కార్యక్రమాల్లో తరుచూ పాల్గొంటాడు.
Hindutva is built on LIES
Savarkar: Indian ‘nation’ began when Rama defeated Ravana & returned to Ayodhya —> a lie
1992: Babri Masjid is ‘birthplace of Rama’ —> a lie
2023: Urigowda-Nanjegowda are ‘killers’ of Tipu—> a lie
Hindutva can be defeated by TRUTH—> truth is EQUALITY
— Chetan Kumar Ahimsa / ಚೇತನ್ ಅಹಿಂಸಾ (@ChetanAhimsa) March 20, 2023
కాగా, సోమవారం చేసిన చేతన్ ట్వీట్లో హిందుత్వ అనేది అబద్ధాల పునాదుల మీద నిర్మించబడిందని రాసుకొచ్చారు. రానణుడిని రాముడు చంపడం అనంతరం భారతదేశం ప్రారంభమైందని సావర్కర్ చెప్పిన మాటలు అబద్ధమని, బాబ్రి మసీదు కింద రామాలయం ఉందనేది అబద్ధమని, అలాగే ఈ మధ్య కర్ణాటకలో ఉరిగౌడ, నంజెగౌడ అనే ఇద్దరు టిప్పు సుల్తాన్ను చంపారనే ప్రచారం బీజేపీ పెద్ద ఎత్తున చేస్తోందని, అయితే అది కూడా అబద్ధమని చేతన్ ట్వీట్ చేశాడు. నిజాలతో హిందుత్వాన్ని జయించవచ్చని చివరలో రాసుకొస్తూ సమానత్వమే సత్యం అని అన్నాడు. కన్నడ, ఇంగ్లీషు భాషల్లో ఈ ట్వీట్ చేశాడు.