Karnataka Govt: ఏసీబీని రద్దు చేసిన కర్ణాటక ప్రభుత్వం.. ఇకపై అవినీతి కేసులన్నీ లోకాయుక్తకే

అవినీతి కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ)ని కర్ణాటక ప్రభుత్వం రద్దు చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల కర్ణాటక హైకోర్టు కూడా ఇదే రకమైన తీర్పు ఇచ్చింది.

Karnataka Govt: ఏసీబీని రద్దు చేసిన కర్ణాటక ప్రభుత్వం.. ఇకపై అవినీతి కేసులన్నీ లోకాయుక్తకే

Karnataka Govt: కర్ణాటక రాష్ట్రంలో ఏసీబీ (యాంటీ కరప్షన్ బ్యూరో)ని రద్దు చేస్తూ సీఎం బసవరాజు బొమ్మై ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏసీబీని రద్దు చేసింది. శుక్రవారం దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది.

Viral Video: సఫారి జీప్‌ను వెంటాడిన ఏనుగు.. తప్పించుకున్న టూరిస్టులు.. వీడియో వైరల్

ఇకపై ఏసీబీ స్థానంలో కర్ణాటక లోకాయుక్తనే అవినీతి కేసుల్ని విచారించనుంది. రాష్ట్ర పరిధిలోని అవినీతి కేసుల నమోదు, దర్యాప్తు, తదితర కార్యకలాపాలన్నీ లోకాయుక్త పరిధిలోకే వస్తాయి. అలాగే ప్రస్తుతం విచారణలో ఉన్న అన్ని కేసుల్ని లోకాయుక్తకు ప్రభుత్వం బదిలీ చేసింది. ఇది ప్రభుత్వం మాత్రమే తీసుకున్న నిర్ణయం కాదు. గత నెలలో కర్ణాటక హైకోర్టు కూడా ఏసీబీని రద్దు చేసింది. తక్షణమే ఏసీబీ రద్దు నిర్ణయం అమల్లోకి వస్తుందని, అవినీతీ కేసుల విచారణ అధికారం లోకాయుక్త పోలీసు విభాగానికే బదిలీ అవుతుందని కోర్టు పేర్కొంది. అవినీతి కేసుల విచారణ, కేసుల విచారణ లోకాయుక్త పరిధిలోనే జరగాలని కోర్టు సూచించింది.

BiggBoss 6 Day 5 : మొత్తానికి ఫస్ట్ కెప్టెన్ బాలాదిత్య.. వరస్ట్ పర్ఫార్మర్ గీతూ.. అనుకున్నదే అయిందిగా..

కోర్టు తీర్పుపై కర్ణాటక ప్రభుత్వానికి పైకోర్టు వెళ్లే అవకాశం ఉంది. కానీ, ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయానికి కట్టుబడి ఉండటంతో లోకాయుక్తను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో చాలా రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఏసీబీ చరిత్ర కర్ణాటకలో ముగియనుంది.