Night curfew‌పై నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న కర్నాటక

Night curfew‌పై నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న కర్నాటక

TG Corona

Karnataka govt night curfew : కొత్త రకం కరోనా వైరస్ భారతదేశాన్ని మళ్లీ గడగడలాడేలా చేస్తోంది. బ్రిటన్‌ (britain) లో కొత్త వైరస్ (new Covid Strain) ప్రబలుతుండడం, వేగంగా విస్తరిస్తుండడంతో భారతదేశంలోని పలు రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. పలు నిబంధనలు, ఆంక్షలు విధిస్తున్నాయి. అందులో భాగంగా..కర్నాటక రాష్ట్ర సర్కార్ (Karnataka govt) ఓ అడుగు ముందుకేసి నైట్ కర్ఫ్యూ (night curfew) విధిస్తున్నట్లు సీఎం యడియూరప్ప (BS Yediyurappa) ప్రకటించిన సంగతి తెలిసిందే. 2020, డిసెంబర్ 24వ తేదీ గురువారం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 05 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని, జనవరి 01వ వరకు అమల్లో ఉంటుందని ప్రకటించారు. ఈ నిర్ణయం అమల్లోకి రాకముందే..ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది.

బ్రిటన్‌లో కొత్త వైరస్ విస్తరిస్తుండడంతో నిపుణుల సూచనల మేరకు..రాత్రి వేళ కర్ఫ్యూ విధించాలని తొలుత నిర్ణయించడం జరిగిందని సీఎం యడియూరప్ప వెల్లడించారు. కానీ..ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా..కర్ఫ్యూ అమలు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోందని, కేబినెట్ మంత్రులు, సీనియర్ అధికారులతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని వివరించారు.
కానీ..ప్రజలు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి చేయాలని సూచించారు. అనవసర ప్రయాణాలకు దూరంగా ఉంటే బెటర్ అని, ప్రభుత్వం విధించిన కొవిడ్ – 19 (Covid -19) నిబంధనలు పాటించాలని సూచించారాయన.