కర్ణాటక మంత్రి రాసలీలలు.. యాక్షన్ తీసుకుంటామంటోన్న బీజేపీ

కర్ణాటక మంత్రి రాసలీలలు.. యాక్షన్ తీసుకుంటామంటోన్న బీజేపీ

karnataka minister

Karnataka minister: కర్ణాటక జలవనరుల మంత్రి రమేశ్‌ జార్కిహోళి సెక్స్‌ స్కాండల్‌లో ఇరుక్కున్నారు. మంత్రి రమేశ్‌ జార్కిహొళి యువతితో రాసలీలలు జరుపుతున్న వీడియోను బెంగళూరు మీడియాకు విడుదల చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానంటూ యువతిని లోబర్చుకున్నారని మోసం చేశారని ఆడియో, వీడియోను బెంగళూరు నగర పోలీసు కమిషనర్‌ కమల్‌పంత్‌కు పౌరహక్కుల పోరాట సమితి అధ్యక్షుడు దినేశ్‌ కల్లహళ్లి అందజేశారు. బెంగళూరులోని ఆర్‌టీ నగరలో నివాసం ఉండే యువతి రాష్ట్రంలోని డ్యామ్‌లను డ్రోన్‌ కెమెరా ద్వారా చిత్రీకరించి డాక్యుమెంటరీ తీసేందుకు అనుమతి ఇవ్వాలని మంత్రిని ఆశ్రయించింది.

అలా పరిచయమై శారీరక సంబంధం వరకూ వెళ్లిందనేది ఆమె తరపు ఆరోపణ. ఈ రాసలీలల వీడియో పలు టీవీ చానళ్లలో ప్రసారం కావడంతో సంచలనం చోటుచేసుకుంది. కేపీటీసీఎల్‌లో (కర్ణాటక పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌) ఉద్యోగం ఇప్పిస్తానని బెంగళూరు ఆర్‌టీ నగర్‌కు చెందిన యువతిని లొంగదీసుకున్న మంత్రి రమేశ్‌జార్కిహొళి ఆమెతో రాసలీలలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ వీడియోను ఎక్కడ, ఎవరు తీశారనేది స్పష్టత లేదు. ఉద్యోగం ఇప్పిస్తానని ఆనక మోసం చేసినందుకు ప్రతీకారంగా బాధితురాలేపక్కా ప్రణాళికతోనే వీడియో తీయించి ఉంటుందని భావిస్తున్నారు.

మరో కథనం ప్రకారం షార్ట్‌ ఫిల్మ్‌ తీసేందుకు మంత్రితో ఆమె సాన్నిహిత్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి నుంచి తనకు ప్రాణహాని ఉన్నదని దినేశ్‌ కల్లహళ్లితో బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. కర్ణాటక శాసనసభ సమావేశాలు మరో రెండ్రోజుల్లో మొదలవుతున్నాయి. అలాగే, రమేశ్‌ జార్కిహోళి అ డ్డా బెళగావి లోక్‌సభ నియోజకవర్గానికి మరికొద్ది రోజుల్లో ఉప ఎన్నిక జరగనున్నాయి. మంత్రి రాసలీలల వ్యవహారం ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది.

మంత్రి మామూలోడు కాదు:
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటులో రమేశ్‌ జార్కిహొళి అత్యంత కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్‌, జేడీఎస్‌ అసంతృప్త ఎమ్మెల్యేలను సమీకరించి వారితో తిరుగుబావుటా లేవనెత్తించి శాసనసభ్యత్వాలకు రాజీనామా చేయించిన సమయంలో రమేశ్‌ జార్కిహొళి అత్యంత కీలకంగా వ్యవహరించారు. కాంగ్రె‌స్‌కు చెందిన సీనియర్‌ నేత. కాంగ్రెస్‌ పార్టీ కర్ణాటక శాఖ నేతలతో విభేదించి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి రావడానికి పక్కాగా పావులు కదిపారు. అలాంటి నేత వివాదంలో చిక్కుకోవడం ముఖ్యమంత్రిని ఇరకాటంలో పడేసింది. ‘వీడియోను విడుదల చేసిన సామాజిక కార్యకర్త ఎవరో తెలియదు. వీడియోలో కనిపించిన యువతి ఎవరో కూడా తెలియదు. తప్పు చేసినట్టు రుజువైతే ఉరిశిక్షకూ సిద్ధమే’ అని మంత్రి ప్రకటించారు.

ఈ వీడియోపై కాంగ్రెస్ వర్కర్లు బెంగళూరు వీధుల్లో ఆందోళనకు దిగారు. మంత్రిపై అరెస్టును డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. దీనిపై బీజేపీ కూడా స్పందించింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ మాట్లాడుతూ.. ఘటనను వెరిఫై చేస్తున్నాం.

‘రాష్ట్ర మంత్రి రమేశ్ జరకిహోలీ ఆ వీడియోను మీడియాలో చూశానని చెప్పారు. పార్టీ చీఫ్, ముఖ్యమంత్రితో మాట్లాడతా. ఆ సీడీ నిజమా అబద్ధమా అని విచారణ జరుపుతాం. అని కేంద్రం మంత్రి వెల్లడించారు.