Karnataka : PSI పోస్టుల భర్తీలో అక్రమాలు..న్యాయం చేయకపోతే నక్సల్స్‌లో చేరుతామని ప్రధానికి రక్తంతో లేఖ రాసిన అభ్యర్థులు

PSI పోస్టుల భర్తీలో అక్రమాలను అరికట్టి తమకు న్యాయం చేయకపోతే నక్సల్స్‌లో చేరుతామని పేర్కొంటూ ప్రధానికి రక్తంతో లేఖ రాసారు అభ్యర్థులు.

Karnataka : PSI పోస్టుల భర్తీలో అక్రమాలు..న్యాయం చేయకపోతే నక్సల్స్‌లో చేరుతామని ప్రధానికి రక్తంతో లేఖ రాసిన అభ్యర్థులు

Karnataka Si Candidates Write Letter In Blood To Pm Modi

Karnataka : ‘డబ్బున్న వారికే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయా? కష్టపడి చదువుకున్నవారికి రావా? న్యాయంగా ఉండాల్సినవారు అక్రమాలకు పాల్పడితే ఇక కష్టపడి చదువుకున్నవారి పరిస్థితి ఏంటి?’ అని ప్రశ్నిస్తూ..ఎస్సై పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయంటూ ప్రధాని మోడీకి అభ్యర్ధులు తమ రక్తంతో లేఖలు రాసిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. తమకు న్యాయం చేయకపోతే..సమాజానికి సేవలు చేయాల్సిన తాము నక్సల్స్ లో చేరతాము అని స్పష్టం చేస్తూ ఆవేదనతో ప్రధానికి లేఖ రాశారు. అక్రమాల వల్ల కష్టపడి చదువుకున్న వారికి అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు అభ్యర్ధులు రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 545 మంది పోలీసు సబ్‌ ఇన్‌స్పెక్టర్ల భర్త విషయంలో అభ్యర్థులు రక్తంతో రాసిన లేఖ వైరల్ గా మారింది. కర్ణాటకలో జరిగిన ఎస్సై పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయని, దీనిపై సమగ్రంగా విచారించాలని, అక్రమాలకు పాల్పడిన వారిని శిక్షించాలని అందులో డిమాండ్ చేశారు.

Also read : Viral letter : ఇంట్లో డబ్బుల్లేకపోతే తాళం ఎందుకేశారు? కలెక్టర్ ఇంట్లో చోరీ చేసిన దొంగల లేఖ

అక్రమ మార్గంలో ఎస్సై పోస్టుకు ఎంపిక కావాలనుకున్న వారి వల్ల కష్టపడి చదివి, పరీక్షల్లో ఎంపికైన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, అటువంటివారికి అన్యాయం జరగకుండా చూడాలని లేఖలో కోరారు. ప్రధానిపై మాకు చాలా గౌరవం ఉందని లేఖలో పేర్కొన్నారు. దయచేసి తాము రాసిన లేఖలను పరిగణలోకి తీసుకుని తమకు..తమలాంటివారికి జరిగే అన్యాయాలపై స్పందించి అక్రమాలు చేసేవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

రాష్ట్రంలో డబ్బులున్న వారికే ప్రభుత్వ ఉద్యోగమన్న విధానం జరుగుతోంది అంటూ లేఖలో అభ్యర్థులు ఆవేదన వ్యక్తంచేశారు. ఎంత కష్టపడినా ఉద్యోగాలు రాక కుటుంబాలకు భారంగా మారుతున్నామని..దీంతో తాము మానసిక స్థైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్య చేసుకోవాలనే మానసిక స్థితికి గురి అవుతున్నామని దయచేసి తమ పరిస్థితి అర్థం చేసుకుని చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాదు..పోస్టుల భర్తీల్లో అన్యాయం జరిగితే నక్సల్స్‌లో చేరుతామని ఆ లేఖలో పేర్కొన్నారు. మొత్తం ఎనిమిది మందిమి కలిసి లేఖ రాశామని అందులో పేర్కొన్నప్పటికీ వారి పేర్లు కానీ, ఫోన్ నంబర్లు కానీ లేకుండా జాగ్రత్త పడ్డారు. కర్ణాటకలో ఇప్పుడీ లేఖ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రెండు పేజీలు ఉన్న ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also read : Viral Resign Letter : మహిళా ఉద్యోగి వెరైటీ రిజైన్ లెటర్..బాస్ కి దిమ్మ తిరిగిపోయిందిగా..

కాగా..కర్ణాటకకు చెందిన పీఎస్‌ఐ పరీక్షల కుంభకోణంపై విచారణ కొనసాగుతోంది. ప్రధాన నిందితులు దివ్య, వీరేష్, వైజ్‌నాథ్, మంజునాథ్ మెలకుండి, అర్చన, సునీత, కాళిదాస్, సునీతా పాటిల్, సురేశ్ కటేగావ్, సద్దాం సహా 55 మందికి పైగా ఇప్పటి వరకు అరెస్టు చేశారు. ఈ అన్యాయాన్ని సరిదిద్దేందుకు పోరాటం సాగుతోంది. ఈక్రమంలో అభ్యర్థులు ప్రధాని నరేంద్ర మోడీకి రక్తంతో లేఖ రాశారు.

రిక్రూట్‌మెంట్ స్కామ్ ఎలా వెలుగులోకి వచ్చింది?
ఒక ప్రశ్నపత్రంలో కేవలం 21 ప్రశ్నలకు మాత్రమే ప్రయత్నించి 100 శాతం మార్కులు సాధించడంతో కలబురగి జిల్లాలో రిక్రూట్‌మెంట్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. అఫ్జల్‌పూర్ ఎమ్మెల్యే గన్‌మెన్‌తో సహా ఇప్పటి వరకు 55 మందిని అరెస్టు చేశారు. అన్‌వర్స్ కోసం, 545 పోస్టులకు 54,000 మందికి పైగా అభ్యర్థులు పరీక్ష రాశారు. అభ్యర్థుల నుంచి రూ.75 లక్షల నుంచి 80 లక్షల వరకు లంచం వసూలు చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసు వర్గాలు తెలిపాయి.

Also read : Resign Letter viral : టాయిలెట్ పేప‌ర్ మీద రిజైన్ లెటర్ రాసిచ్చిన ఉద్యోగి..బాస్ రియాక్షన్ చూసి దిమ్మతిరిగిపోయిందిగా..