Karnataka : ఆలయాల్లో భక్తులకు ‘డ్రెస్‌ కోడ్‌’

రాష్ట్ర ధార్మిక పరిషత్ కీలక నిర్ణయం తీసుకుంది. దేవాలయాల్లో డ్రెస్ కోడ్ తీసుకురావాలని నిర్ణయించింది. తమ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది.

Karnataka : ఆలయాల్లో భక్తులకు ‘డ్రెస్‌ కోడ్‌’

Karnataka (2)

Karnataka : కర్ణాటక రాష్ట్ర ధార్మిక పరిషత్ కీలక నిర్ణయం తీసుకుంది. దేవాలయాల్లో డ్రెస్ కోడ్ తీసుకురావాలని నిర్ణయించింది. తమ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది.. దీనిపై ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే డ్రెస్ కోడ్ అమలులోకి రానుంది. మొత్తం 211 దేవాలయాల్లో భక్తులకు డ్రెస్ కోడ్ అమలు చేయాలనుకున్నామని రాష్ట్ర ధార్మిక పరిషత్ తెలిపింది. ‘హిందూ సాంస్కృతిక విలువలను గౌరవించే దుస్తుల కోడ్‌ని అనుసరించాలని భక్తులను కోరుతున్నాం. మహిళలు చీరలు ధరించేందుకు ప్రాధాన్యతనివ్వాలి. పురుషుల కోసం కూడా డ్రెస్‌ కోడ్‌ నిర్ణయిస్తున్నాం’ అని పూజారి హరినారాయణ అస్రన్న తెలిపారు. డ్రెస్ కోడ్ కి సంబందించిన ఫ్లెక్సీలను దేవాలయాల వద్ద ఉంచారు.

Read More : Maa Election: అసభ్యంగా మాట్లాడారా.. నరేష్, కళ్యాణిలపై హేమా ఫిర్యాదు!

మరోవైపు దక్షిణ కన్నడ జిల్లాలోని కటీల్ దుర్గాపరమేశ్వరి దేవాలయం, పొలాలి రాజరాజేశ్వరి దేవాలయంలో సాంప్రదాయ దుస్తులను కర్ణాటక రాష్ట్ర ధార్మిక పరిషత్ ఇటీవల తప్పనిసరి చేసింది.  ప్రభుత్వం నియంత్రణలో ఉన్న దేవాలయాల్లో ఆచారాలు, పూజల నిర్వహణతోపాటు భక్తుల కోసం డ్రెస్ కోడ్‌పై ఈ సంస్థ ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. అయితే రాష్ట్ర ధార్మిక పరిషత్ నిర్ణయాన్ని ముందుగా హిందూ మత సంస్థలు, ధార్మిక ట్రస్ట్‌లు ఆమోదించాలి. ఆ తర్వాత క్యాబినెట్‌ ఆమోదం కోసం పంపుతారు. ఇక ఇప్పటికే పలు దేవాలయాల్లో భక్తులు స్వచ్చందంగా సాంప్రదాయ వస్త్రాలు ధరించి దర్శనాలు చేసుకుంటున్నారు.

Read More : Hyderabad : యువతి చెయ్యి పట్టుకున్న క్యాబ్ డ్రైవర్.. చితకబాదిన స్థానికులు