ఈసారి కరోనా. ఈ యువ జంట పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకొంటే విపత్తే. రెండేళ్లుగా ఇదే తంతు… వీళ్ల పెళ్లెప్పుడో!

  • Published By: madhu ,Published On : March 22, 2020 / 08:41 AM IST
ఈసారి కరోనా. ఈ యువ జంట పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకొంటే విపత్తే. రెండేళ్లుగా ఇదే తంతు… వీళ్ల పెళ్లెప్పుడో!

కరోనా వైరస్ వెళ్లిపో…ఇప్పటికే ఎన్నోసార్లు పెళ్లి వాయిదా వేసుకున్నాం..ప్లీజ్ త్వరగా ఇక్కడి నుంచి వెళ్లు..తిరిగి రాకు..అంటున్నారు ఓ యువ దంపతులు. రెండుసార్లు వైరస్, మరోసారి ప్రకృతి విప్తతులు రావడంతో వీరి పెళ్లి వాయిదా పడుతూ వస్తోంది. ఇలా…ఒకసారి కాదు..రెండు సార్లు కాదు..మూడు సార్లు..వీరి ప్రేమ వివాహం వాయిదా పడుతూ వస్తోంది. తాము ఎప్పుడు పెళ్లి చేసుకుంటామా అని ఎదురు చూస్తున్నారు. అసలు ఈ ప్రేమ జంట ఎక్కడ ఉంటారు ? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. 

రళ రాష్ట్రంలోని ఎరాన్హీపాలెం ప్రాంతానికి చెందిన ప్రేమ్ చంద్రన్ (26), సాండ్రా సంతోష్ (23) ప్రేమించుకున్నారు. పెద్దలు అంగీకరిస్తే..వివాహం చేసుకోవాలని అనుకున్నారు. 2018 మే 20వ తేదీన పెళ్లికి ముహూర్తం నిర్ణయించాయి ఇరు కుటుంబసభ్యులు. అదే సమయంలో నిఫా వైరస్ రాష్ట్రాన్ని చుట్టుముట్టింది. ఈ వైరస్ కారణంగా…17 మంది..చనిపోయారు. ఈ సమయంలో పెళ్లి చేసుకోవడం కరెక్టు కాదనుకున్నారు.

మరుసటి ఏడాది అంటే…2019 కేరళ సంవత్సరాది అయిన..ఓనం..పండుగ రోజున వివాహం చేసుకొనేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. పెళ్లి రోజు సమీపించే సరికి…అకస్మిక వరదలు. . 

ఈ వరదలు కేరళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. మరోసారి పెళ్లి వాయిదా పడింది. చివరకు 2020, మార్చి 20వ తేదీన పెళ్లికి మరోసారి ముహూర్తం ఫిక్స్ చేశారు. పిచ్..ఈసారి కూడ వారి కల నెరవేరలేదు. చైనా నుంచి వచ్చిన కరోనా వైరస్ మొట్టమొదట కేరళ రాష్ట్రంలో బయటపడింది. కొద్ది రోజుల్లోనే విస్తృతంగా విస్తరించింది. ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. తప్పనిపరిస్థితుల్లో మరోసారి వాయిదా వేసుకున్నారు. కానీ ఈసారి మాత్రం పక్కా పెళ్లి చేసుకుంటామని అంటున్నారు ఈ యువ దంపతులు. 2020, సెప్టెంబర్ నెలలో పెళ్లి చేసుకుంటామంటున్నారు.