Ladakh : వ్యాక్సినేషన్ లో లడఖ్ రికార్డు..మొత్తం జనాభాకి కోవిడ్ వ్యాక్సిన్

దేశంలో జనాభా అందరికీ వ్యాక్సినేషన్ జరిగిన తొలి కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ నిలిచింది.

Ladakh : వ్యాక్సినేషన్ లో లడఖ్ రికార్డు..మొత్తం జనాభాకి కోవిడ్ వ్యాక్సిన్

Ladakh3

Ladakh దేశంలో జనాభా అందరికీ వ్యాక్సినేషన్ జరిగిన తొలి కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ నిలిచింది. ప్రధాని మోదీ,ఆరోగ్యశాఖ,కోవిడ్ వారియర్స్ కృషి కారణంగా పూర్తి వ్యాక్సినేషన్ జరిగిన తొలి కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ నిలిచిందని ఆ ప్రాంత లోక్‌సభ ఎంపీ, బీజేపీ నేత జామ్యాంగ్ సేరింగ్ నామ్‌గ్యాల్ ఆదివారం తెలిపారు.

లడఖ్‌ వాసులతో పాటు అక్కడికి వచ్చిన అతిథులకు కూడా వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందని ఎంపీ సేరింగ్ నామ్‌గ్యాల్ తెలిపారు. అయితే టీకా రెండు డోసులు కాకుండా ప్రస్తుతానికి మొదటి డోసు అందరికీ వేశామని ఆయన తెలిపారు. దీంతో వ్యాక్సీనేషన్ మొదటి డోస్ పూర్తైన పూర్తైన మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ నిలిచిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

అధికారిక డేటా ప్రకారం..లడఖ్ లో 18-44ఏళ్ల వయస్సు వారితో కూడా కలిపి మొత్తంగా అర్హులైన 89,404 మందికి మొదటి డోస్ కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చారు. 60,936మందికి కోవిడ్ రెండు డోసులు ఇచ్చారు. మూడో దశ వ్యాక్సినేషన్ ప్రారంభమైన మూడు నెలల్లోపే ఇదంతా సాధ్యమైంది. వ్యాక్సిన్ అందుకున్నవారిలో లడఖ్ లో నివసిస్తున్న 6,821మంది నేపాల్ పౌరులు కూడా ఉన్నారు.