కోవిడ్ ప్రోటోకాల్.. మధ్యాహ్నం ప్రణబ్ అంత్యక్రియలు.. అధికారిక లాంఛనాలతో చివరి వీడ్కోలు

  • Published By: vamsi ,Published On : September 1, 2020 / 07:31 AM IST
కోవిడ్ ప్రోటోకాల్.. మధ్యాహ్నం ప్రణబ్ అంత్యక్రియలు.. అధికారిక లాంఛనాలతో చివరి వీడ్కోలు

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 84 సంవత్సరాల వయస్సులో ఆగస్టు 31వ తేదీన ఆర్మీ ‘రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్’లో చనిపోయారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కాగా ప్రణబ్ ముఖర్జీ మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి ఉదయం 8 గంటలకు అతని అధికారిక నివాసమైన రాజాజీ మార్గ్‌కు తీసుకుని రానున్నారు.



ఉదయం 9గంటల 30నిమిషాలకు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రణబ్ మృతదేహాన్ని ఆయన అధికారిక నివాసంలో చూస్తారు. ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని తుది నివాళులు అర్పించనున్నారు. ఉదయం 11 నుండి 12 వరకు, అతని మృతదేహం నిర్దిష్ట వ్యక్తుల కోసం సందర్శనకు ఉంచుతారు.
https://10tv.in/celebrities-tweet-on-pranab-mukherjee-demise/
ఆయన అంత్యక్రియలు మధ్యాహ్నం 2 గంటలకు లోధి రోడ్‌లోని శ్మశానవాటికలో అధికారిక లాంఛనాలతో జరుగుతాయి. కరోనా కారణంగా ప్రణబ్ అంత్యక్రియలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు అధికారులు. కోవిడ్ ప్రోటోకాల్ కింద దహన సంస్కారాలు నిర్వహించి ప్రణబ్ ముఖర్జీకి ఈ రోజు చివరి వీడ్కోలు పలకనున్నారు.



ప్రణబ్ ముఖర్జీ మృతిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. ఐదు దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంలో, కాంగ్రెస్ పార్టీ మరియు కేంద్ర ప్రభుత్వంలో ప్రణబ్ భాగంగా ఉన్నారని ఆమె అన్నారు.