Bhagwant Mann: అవినీతి నాయకుల జాబితా సిద్ధమైంది.. వాళ్లు జైలుకెళ్లడం ఖాయం..

అవినీతి రాజకీయ నాయకుల జాబితాసిద్ధమైంది.. నాకు కొంచెం సమయం ఇవ్వడం వారందరి భరతం పట్టి జైలు ఊసలు లెక్కబెట్టేలా చేస్తాం.. బెయిల్ కూడా లభించకుండా కఠిన చర్యలు తీసుకుంటాం అంటూ ఆప్ నేత, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ అన్నారు.

Bhagwant Mann: అవినీతి నాయకుల జాబితా సిద్ధమైంది.. వాళ్లు జైలుకెళ్లడం ఖాయం..

Punjab Cm Bhagwant Mann

Bhagwant Mann: అవినీతి రాజకీయ నాయకుల జాబితాసిద్ధమైంది.. నాకు కొంచెం సమయం ఇవ్వడం వారందరి భరతం పట్టి జైలు ఊసలు లెక్కబెట్టేలా చేస్తాం.. బెయిల్ కూడా లభించకుండా కఠిన చర్యలు తీసుకుంటాం అంటూ ఆప్ నేత, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ అన్నారు. ఉప ఎన్నిక జరుగనున్న సంగ్రూర్ లోక్‌సభ ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అభ్యర్థి గుర్మైల్ సింగ్ గెలుపు కోసం బర్నాలాలోని బదౌర్‌లో గురువారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్‌ షోలో పాల్గొన్న సీఎం భగవంత్‌ మాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను హామీ ఇస్తున్నా, నాకు కొద్ది సమయం ఇవ్వండి.. అవినీతి నేతల భరతం పడదాం అంటూ ప్రజలను కోరారు.

Ap Government: ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు.. ‘బైజూస్‌’తో ఒప్పందం.. జగన్ కీలక వ్యాఖ్యలు

ఈ ఏడాది మార్చిలో జరిగిన పంజాబ్ ఎన్నికల్లో 117 స్థానాల్లో ఆప్ 92 స్ధానాల్లో గెలుపొంద‌గా  కాంగ్రెస్ కేవ‌లం 18 సీట్ల‌తో స‌రిపెట్టుకుని ప‌రాజ‌యం మూట‌గ‌ట్టుకుంది. మార్చి 16న పంజాబ్ సీఎంగా ఆమ్ ఆద్మీ నేత భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పాలన సాగిస్తున్నారు. ఈ క్రమంలో అవినీతి ఆరోపణలు రావడంతో సొంత క్యాబినెట్ సభ్యుడిని బర్తరఫ్ చేసి సంచలనం సృష్టించాడు.

Power crisis: ఆస్ట్రేలియాలో విద్యుత్ సంక్షోభం.. భారత్‌‌పై ప్రభావం.. ఎందుకంటే?

గత ప్రభుత్వ పాలనలో అవినీతికి పాల్పడిన నేతలను ఒక్కొక్కరిపై కేసులు నమోదు చేసి జైలు పంపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా భగవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతి రాజకీయ నేతల జాబితాలను ప్రభుత్వం తయారు చేసిందని అన్నారు. ఇప్పటికే కొంత మందిని జైలుకు పంపాం. మరికొందరు వారి వంతుకోసం వేచి ఉన్నారంటూ పేర్కొన్నారు. జాబితాలు సిద్ధమయ్యాయి, వారికి బెయిల్ కూడా రాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం అంటూ భగవంత్ పేర్కొన్నారు. మీరు చెల్లించిన పనులు మొత్తం వారే తినేశారంటూ గత ప్రభుత్వ పాలకుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వాటిని తిరిగి వారి నుంచే రప్పించేలా ప్రయత్నం చేస్తున్నాను, కొంత సమయం పడుతుంది, అప్పటి వరకు ఓపికపట్టి ప్రభుత్వానికి అండగా నిలవాలంటూ భగవంత్ మాన్ ప్రజలకు సూచించారు. వారి నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్న డబ్బును మీ కోసం ఖర్చు చేస్తానంటూ పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ నేత, మాజీ అటవీశాఖ మంత్రి సాధు సింగ్ ధర్మసోత్ పై భగవంత్ మాస్ సింగ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వారి స్వార్థం కోసం రాష్ట్ర ఆక్సిజన్ అయిన చెట్లను కూడా అమ్మేశారని, వారికి కూడా ఆక్సిజన్ అవసరమన్న విషయాన్ని కూడా మర్చిపోయారంటూ భగవంత్ మాన్ దుయ్యబట్టారు.