Lockdown : మహారాష్ట్రలో మే-31వరకు లాక్ డౌన్ పొడిగింపు

కరోనా కట్టడి కోసం మహారాష్ట్రలో విధించిన లాక్ డౌన్ తరహా ఆంక్షలను మే-31వరకు పొడిగించింది ఉద్దవ్ సర్కార్.

Lockdown : మహారాష్ట్రలో మే-31వరకు లాక్ డౌన్ పొడిగింపు

Lockdown

Lockdown కరోనా కట్టడి కోసం మహారాష్ట్రలో విధించిన లాక్ డౌన్ తరహా ఆంక్షలను మే-31వరకు పొడిగించింది ఉద్దవ్ సర్కార్. ఈ మేరకు ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంది. 18-44ఏళ్ల లోపు వయస్సు వారికి వ్యాక్సిన్ ఇవ్వడాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మే-20తర్వాత 1.5కోట్ల వ్యాక్సిన్ డోసులను అందిస్తామని సీరం సంస్థ అధినేత సీఎంకి మాట ఇచ్చారని..వ్యాక్సిన్ అందాక 18-44ఏళ్ల లోపువారికి వాక్సిన్ ఇవ్వడం ప్రారంభిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే తెలిపారు.

ఇక,మహారాష్ట్రలో గడిచిన 24గంటల్లో కొత్తగా 46,781కరోనా కేసులు,816మరణాలు నమోదవగా..58,805మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,46,129కి చేరుకోగా మరణాల సంఖ్య 78,007కి చేరింది. ఇప్పటివరకు మహారాష్ట్రలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 46,00,196.