క్లీన్ గంగా : లాక్ డౌన్ తో సత్ఫలితాలు…పెరిగిన గంగా నది నీటి నాణ్యత

  • Published By: venkaiahnaidu ,Published On : April 5, 2020 / 10:33 AM IST
క్లీన్ గంగా : లాక్ డౌన్ తో సత్ఫలితాలు…పెరిగిన గంగా నది నీటి నాణ్యత

కరోనా వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా భారత్ 21రోజుల లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోని చాలా దేశాలు కూడా కరోనా దృష్ట్యా లాక్ డౌన్ లోనే ఉన్నాయి. లాక్ డౌన్ లకారణంగాా భారత్ సహా దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో భారత్ లో వివిధ రంగాల‌కు చెందిన సంస్థ‌లు, కంపెనీలు, కార్యాల‌యాలు అన్ని బంద్ అయ్యాయి.

లాక్ డౌన్ తో చాలా వ‌ర‌కు ప‌రిశ్ర‌మ‌లను కూడా మూసివేశారు. ప‌రిశ్ర‌మల మూసివేత ఫ‌లితంగా..వాటి నుంచి వ‌చ్చే వ్య‌ర్థాలు ఆగిపోయాయి. ఎక్క‌డైనా ప‌రిశ్ర‌మల నుంచి వెలువ‌డే ఉద్గారాలు దగ్గర్లోని నదుల్లో,సరస్సుల్లో లేదా చెరువుల్లో క‌లుస్తుంటాయన్న విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు లాక్ డౌన్ సత్ఫలితాలు సృష్టంగా కన్పిస్తున్నాయి. ప‌రిశ్ర‌మ‌ల మూసివేత వ‌ల్ల దేశంలోనే అతిపెద్దదైన గంగా న‌దిలోకి వ్య‌ర్థాలు రాక‌పోవ‌డంతో…గంగాజలం రోజురోజుకీ శుద్ది అవుతోందట. వార‌ణాసిలో గంగా న‌ది ప‌రివాహ‌క ప్రాంతంలో నీటి నాణ్య‌త పెరిగింది. ఈ విష‌యాన్ని బెనార‌స్ హిందూ యూనివ‌ర్సిటీ-ఐఐటీలో కెమిక‌ల్ ఇంజినీరింగ్, టెక్నాల‌జీ విభాగం ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ పీకే మిశ్రా తెలిపారు. లాక్ డౌన్ త‌ర్వాత గంగాన‌దిలో నీటి నాణ్య‌త 40-50 శాతం పెరిగింద‌ని మిశ్రా తెలిపారు.

వారణాసిలోని ఉత్తర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (UPPCB) ప్రాంతీయ అధికారి కలికా సింగ్ మాట్లాడుతూ…గంగా నదిలో ఎగువ ప్రవాహంలో కరిగిన ఆక్సిజన్ స్థాయి లీటరుకు 8.9 మి.గ్రా, దిగువ ప్రవాహంలో కరిగిన ఆక్సిజన్(dissolved oxygen) స్థాయి లీటరుకు 8.3 మి.గ్రా ఉందన్నారు. ఇది నీటి నాణ్యతను స్పష్టంగా చూపిస్తుందని, గణనీయంగా మెరుగుపడిందని మరియు ఇది స్నానానికి మంచిది తెలిపారు.

 ఆరోగ్యకరమైన నీరు కనీసం 7 mg / లీటరు కరిగిన ఆక్సిజన్ స్థాయిని కలిగి ఉండాలని సింగ్ తెలిపారు. లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుండి, ప్రజలు తమ ఇళ్ళ లోపల ఉన్నందున వారణాసిలోని రోడ్లు పూర్తిగా ఎడారిగా మారిపోయాయి. నిత్యావసర సేవల్లో నిమగ్నమైన వారిని మాత్రమే నగరంలోని రోడ్లపై చూడవచ్చుని సింగ్ తెలిపారు. ఈ కారణంగా నగరంలో గాలి నాణ్యత మెరుగుపడింది మరియు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం సంతృప్తికరంగా మారింది అని సింగ్ తెలిపారు.

ఎయిర్ పొల్యూషన్ కారణంగా దశాబ్దాల కాలంగా కనుమరుమైన ప్రకృతి అందాలను ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా మళ్లీ చూడగలుగుతున్నారు ప్రజలు. ఇన్నాళ్లు ఇబ్బడిముబ్బడిన రోడ్లపై తిరిగిన వాహనాలు అన్నీ ఒక్కసారిగా ఇళ్లల్లోనే ఉండిపవడంతో,ఇప్పటివరకు కంటికి కనిపించని పక్షలు ఇప్పుడు మన ఇళ్ల ముందుకొస్తున్నాయి. పలుచోట్ల అడవుల్లో ఉండే జంతువులు కూడా రోడ్లపైకి వస్తున్నాయి. భారత్ లో వాయు కాలుష్యం తగ్గి ఇప్పుడు కొంతమేరకు అందరికీ స్వచ్ఛమైన గాలి లభిస్తుంది.