మందుబాబుల దెబ్బ: తమిళనాటలో ఎన్నికలు..ఏపీలో మద్యం  ఖాళీ 

  • Published By: veegamteam ,Published On : April 19, 2019 / 07:26 AM IST
మందుబాబుల దెబ్బ: తమిళనాటలో ఎన్నికలు..ఏపీలో మద్యం  ఖాళీ 

ఎండలు మండిపోతున్నాయి..దీనికి తోడు తమిళనాడులో లోక్ సభ ఎన్నికలు జరిగాయి. ఆంధ్రా తమిళనాడు బోర్డర్ ప్రాంతం అయిన తడలో  మద్యం షాపులన్నీ ఖాళీ అయిపోయాయి.  ఏంటీ తమిళనాడులో ఎన్నికలైతే..ఏపీలోని నెల్లూరు జిల్లాలోని తడలో మందు షాపులు ఖాళీ అయిపోవటం ఏంటనుకుంటున్నారా?తమిళనాడులో లోక్ సభ ఎన్నికల సందర్భంగా మద్యం షాపులు మూసివేయటంతో వారంతా తడ మందుషాపులపై పడ్డారు. దీంతో షాపులన్నీ ఖాళీ అయిపోయాయి. తాగాలనే కోరిక ఉండాలి గానీ బోర్డర్ ప్రాంతమేంట నా బొంద..ఎక్కడికైనా వెళ్లి తెచ్చేసుకుని మరీ తాగేస్తారు మందుబాబులు.

ఏప్రిల్ 18న తమిళనాడులో పార్లమెంట్‌ ఎన్నికలు జరిగిన దృష్ఠ్యా 16వ తేదీ నుంచి మద్యం షాపులు మూసేశారు. దాంతో తమిళనాడు మద్యం ప్రియులకు మద్యం దొరక్కపోవడంతో  తడ, సూళ్లూరుపేట వైపులకు పరుగులు తీశారు. దీంతో 17వ తేదీకల్లా మందుషాపులన్నీ తమిళ మద్యం ప్రియులతో కిటకిటలాడిపోయాయి. బస్, ట్రైన్స్ ఇలా ఏది దొరికితే అది పట్టుకుని ఇక్కడ వాలిపోయారు.కావాల్సిన బ్రాండ్‌ ఏది దొరికితే అది అదీ లేకుండా చివరికి ఛీప్‌ లిక్కర్‌ ని కూడా కొనుక్కుపోయారు తమళమందుబాబులు.

అదీ కూడా సాధారణ రేటు కంటే 30 రూపాయలు అధికంగా చెల్లించి కొనుక్కుపోయారు. సరుకు ఖాళీ అయిపోవటం షాపు యజమానులు దుకాణాలను మూసివేసారు. అబ్బా ఇంకా స్టాక్ ఉంటే బాగుండు ..దుడ్లు (డబ్బులు) దండిగా వచ్చేవి  అంటు షాపు ఓనర్స్ వాపోయారట. కాగా మద్యం కోసం రెక్కలు కట్టుకుని తడలో వాలిపోయిన మందు ప్రియులు కొంతమందికి మందు దొరక్కపోవటంతో సూళ్లూరుపేటకు పరిగెత్తారట. ఆహా మందు మహత్యం అంతగా ఉంటుందా..అన్నం లేకపోయినా ఉండగలరేమో గానీ మందు లేకుంటే బాబులకు ఇంతగా అల్లాడిపోతారా? అనిపిస్తోంది కదూ.