Lucknow building: బాలుడి ప్రాణాలు కాపాడిన కార్టూన్ సీరియల్ డోరెమాన్.. ఎలాగంటే

కార్టూన్స్, టీవీల వల్ల కలిగే మంచి ప్రయోజనాల్ని కూడా ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. ఉత్తర ప్రదేశ్, లక్నోలోని, హజ్రత్‌గంజ్ ప్రాంతంలో మంగళవారం నాలుగంతస్తుల బిల్డింగ్ కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు.

Lucknow building: బాలుడి ప్రాణాలు కాపాడిన కార్టూన్ సీరియల్ డోరెమాన్.. ఎలాగంటే

Lucknow building: రోజూ ఒక బాలుడు ఇష్టంగా చూసే కార్టూన్ అతడి ప్రాణాల్ని కాపాడింది. కార్టూన్స్, టీవీల వల్ల కలిగే మంచి ప్రయోజనాల్ని కూడా ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. ఉత్తర ప్రదేశ్, లక్నోలోని, హజ్రత్‌గంజ్ ప్రాంతంలో మంగళవారం నాలుగంతస్తుల బిల్డింగ్ కూలిపోయిన సంగతి తెలిసిందే.

Tamilisai: తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తా.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం: గవర్నర్ తమిళిసై

ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు. అధికారులు సహాయక చర్యలు ప్రారంభించి, శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు 12 మందికిపైగా రక్షించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక సిబ్బంది శిథిలాల కింది నుంచి రక్షించిన వారిలో ఆరేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. ఈ బాలుడు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. గాయాలపాలైన బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా ఎలాంటి ప్రాణహాని లేదని వైద్యులు చెప్పారు. అయితే, బాలుడికి సంబంధించి ఒక ఆసక్తికర విషయం వెల్లడైంది.

Republic Day parade: భారత గణతంత్ర వేడుకల్లో ఈజిప్ట్ ఆర్మీ.. తొలిసారి పరేడ్ నిర్వహించిన సైన్యం

బాలుడు ఒక కార్టూన్ చూసి, తన ప్రాణాలు కాపాడుకున్నట్లు తెలిపాడు. బిల్డింగ్ కూలిన సమయంలో ముస్తఫా అనే బాలుడు బెడ్ కింద దాక్కుని తన ప్రాణాలు రక్షించుకున్నాడు. భూకంపాలు సంభవించినప్పుడు, బిల్డింగులు కూలిపోయినప్పుడు టేబుల్స్, బెడ్స్ వంటి వాటి కింద దాక్కోవాలనే విషయం తనకు కార్టూన్ ప్రోగ్రామ్స్ చూడటం ద్వారా తెలిసిందని బాలుడు వెల్లడించాడు. బాలుడు డోరెమాన్ సీరియల్ ఇష్టంగా చూసేవాడు. ఇందులో కొన్ని ఎపిసోడ్లలో భూకంపం వచ్చినప్పుడు, ఇండ్లు కూలిపోతున్నప్పుడు ఎలా తప్పించుకోవాలో చూపించారు. దీంతో బిల్డింగ్ ప్రమాదానికి గురి కాగానే బాలుడు వెంటనే బెడ్ కిందకు వెళ్లి దాక్కున్నాడు.

చివరకు బిల్డింగ్ కూలిన తర్వాత బెడ్ కిందే చిక్కుకుపోయాడు. దాదాపు రెండు రోజులపాటు అలాగే ఉండిపోయాడు. సహాయక సిబ్బంది శిథిలాల తొలగించి, బెడ్ కింద ఉన్న బాలుడిని రక్షించారు. మొత్తానికి కార్టూన్ సీరియల్ వల్ల బాలుడు ముస్తఫా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు.