National
Govt Employees : కరోనా ఫీవర్, ప్రభుత్వ ఉద్యోగులకు 5 రోజులే వర్కింగ్ డేస్
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా విస్తరిస్తోంది. దీంతో అక్కడి ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా విస్తరిస్తోంది. దీంతో అక్కడి ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
Publish Date - 12:02 pm, Thu, 8 April 21
Madhya Pradesh : భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ దూసుకెళుతోంది. చిన్నా..పెద్దా అనే తేడా లేకుండా..వైరస్ అందరికి సోకుతోంది. దేశంలో ప్రధాన రాష్ట్రాల్లో వైరస్ పంజా విసురుతుండడంతో ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. కఠిన ఆంక్షలు, నిబంధనలు పెడుతున్నాయి. అత్యవసరం అయితే తప్ప..బయటకు రావొద్దని, మాస్క్ లు, శానిటైజేషన్, సోషల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా విస్తరిస్తోంది. దీంతో అక్కడి ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ ఉద్యోగులకు కేవలం ఐదు రోజులు మాత్రమే పని దినాలు ఉంటాయని సీఎంవో స్పష్టం చేసింది. ఈ నిబంధనలు 2021, ఏప్రిల్ 08వ తేదీ గురువారం నుంచి మూడు నెలల పాటు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. 2021, ఏప్రిల్ 08వ తేదీ గురువారం సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతనలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పట్టణ ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ కర్ఫ్యూ ఉంటుందని తెలిపింది. వీకెండ్ అయిన ఆదివారం మాత్రం పూర్తిస్థాయి లాక్ డౌన్ కొనసాగుతుందని, చింద్వారా జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న క్రమంలో..వారం రోజుల పాటు పూర్తిస్థాయి లాక్ డౌన్ విధిస్తున్నట్లు సీఎంవో వర్గాలు వెల్లడించాయి.
ఇక కరోనా కేసుల విషయానికి వస్తే…గత 24 గంటల్లో 4 వేల 043 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. మొత్తం కేసుల సంఖ్య 3 లక్షల 18 వేల 014కు చేరుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 26 వేల 059గా ఉంది.
Delhi Covid : కరోనా ఉందని తండ్రిని వెళ్లగొట్టాడు…ఆదుకున్న కానిస్టేబుల్
ఆక్సిజన్ కొరతతో ఆరుగురు కరోనా పేషెంట్లు మృతి
Delhi : నిర్మానుష్యంగా ఢిల్లీ…మూతపడిన షాపులు, ఇళ్లలోనే ప్రజలు
Shocking video : ఆక్సిజన్ ఆపేసి కరోనా రోగి ప్రాణాలు తీసిన ఆస్పత్రి సిబ్బంది
Minister Usha Thakur : కరోనా పోవాలంటూ పూజలు చేసిన మంత్రి
Weekend Lockdown: మహారాష్ట్రలో వీకెండ్ లాక్డౌన్ మొదలైంది