Madhya Pradesh MLA : కాంగ్రెస్ ఓటర్లను తగ్గించటానికే ఆఫ్రికా నుంచి చీతాలను తీసుకొచ్చారు..ఇదో పెద్ద కుట్ర : ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు

కాంగ్రెస్ ఓటర్లను తగ్గించటానికే బీజేపీ ప్రభుత్వం ఆఫ్రికా నుంచి చీతాలను తీసుకొచ్చింది అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే సరికొత్త వాదనను తెరపైకి తెచ్చారు. ఆఫ్రికా నుంచి చీతాలను తీసుకువచ్చిన కునో నేషనల్‌ పార్క్‌ కు తీసుకురావటం వెనుక పెద్ద కుట్ర ఉంది అంటూ చెప్పుకొచ్చారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రగిలాల్‌ జాతవ్..

Madhya Pradesh MLA : కాంగ్రెస్ ఓటర్లను తగ్గించటానికే ఆఫ్రికా నుంచి చీతాలను తీసుకొచ్చారు..ఇదో పెద్ద కుట్ర : ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు

Congress MLA feels cheetahs at kuno national park are a threat to his party

Madhya Pradesh MLA Pragilal Jatav :  కాంగ్రెస్ ఓటర్లను తగ్గించటానికే బీజేపీ ప్రభుత్వం ఆఫ్రికా నుంచి చీతాలను తీసుకొచ్చింది అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే సరికొత్త వాదనను తెరపైకి తెచ్చారు. ఆఫ్రికా నుంచి చీతాలను తీసుకువచ్చిన కునో నేషనల్‌ పార్క్‌ కు తీసుకురావటం వెనుక పెద్ద కుట్ర ఉంది అంటూ చెప్పుకొచ్చారు మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రగిలాల్‌ జాతవ్..

కాగా..భారతదేశంలో చీతాలు ఎప్పుడో అంతరించిపోయాయి. దీంతో ప్రధాని మోడీ ప్రభుత్వం ఆఫ్రికా నుంచి ఎనిమిది చీతాలను తీసుకొచ్చింది. ఆఫ్రియాలోని నమీబియా నుంచి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చిన ఈ చీతాలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌లో వదిలారు.అలా 74 ఏళ్ల తర్వాత భారత్‌లోకి తిరిగి చీతాలు అడుగుపెట్టాయి. అవి మెల్లగా ఇక్కడి పరిస్థితులను అలవాటుపడ్డాయి. ప్రధాని మోడీ స్వయంగా చీతాలను కునో నేషనల్ పార్కులోని ఎన్ క్లోజర్ లోకి వదిలారు. ప్రస్తుతం ఆఫ్రియా చీతాలు కునో నేషనల్ పార్కులో హాయిగా జీవిస్తున్నాయి.

ఇదిలా ఉంటే..ఆఫ్రికా నుంచి చీతాలు తీసుకురావటం వెనుక పెద్ద కుట్ర ఉందని అది రాజకీయ కుట్ర అంటూ ఓ సరికొత్త పాయింట్ ను లేవనెత్తారు మధ్యప్రదేశ్ లోని శివ్‌పురి జిల్లా కరేరా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రగిలాల్‌ జాతవ్‌. ఇటీవల కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ రాక సందర్భంగా పార్టీ కార్యకర్తలతో సమావేశమైన సందర్భంగా ప్రగిలాల్ మాట్లాడుతూ..వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రధాని మోడీ ప్రభుత్వం ఆఫ్రియా నుంచి చీతాలను తీసుకురావటం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని..ప్రస్తుతం ఆ చీతాలు చిన్నవి. అవి పెద్ద అయ్యాక మనల్ని తినేస్తాయి. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ ఓటర్లను తినేయటానికే..కాంగ్రెస్ ఓటర్లను తగ్గించటానికి బీజేపీ ప్రభుత్వం చేసిన కుట్ర ఇది అంటూ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ఓటర్లను తగ్గించటానికే చీతాలను ఆఫ్రికా నుంచి తెప్పించింది అంటూ ఇది రాజకీయ కుట్ర అంటూ సరికొత్త పాయింట్ లేపారు.

పేదలు, అణగారిన వర్గాలకు చెందిన కాంగ్రెస్‌ పార్టీని దెబ్బతీయటానికే చీతాలను తెప్పించారంటూ సంచలన ఆరోపణలు చేశారు. నమీబియా నుంచి చీతాలను తీసుకురావటానికి బీజేపీ ప్రభుత్వం రూ.117 కోట్లు ఖర్చు పెట్టిందని ఇదంతా ప్రజల సొమ్ముకాదా? అంటూ ప్రశ్నించారు. రాజకీయాలు చేయటానికి బీజేపీ జంతువులను కూడా వాడుకుంటోంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. సదరు ఎమ్మెల్యేగా మాటలకు సభలోని కార్యకర్తలంతా చప్పట్లు కొట్టటం మరో విశేషం. కార్యకర్తల చప్పట్లకు ఎమ్మెల్యేగారు తెగ మురిసిపోతూ ముసిముసినవ్వులు నవ్వుకున్నారు. అంతేకాదు కమల్ నాథ్ కు స్వాగతం పలటానికి కార్యకర్తలంతా మంచి మంచి డ్రెస్సులు వేసుకోవాలని కూడా సూచించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రగిలాల్‌ జాతవ్..!!