‘Perform yagna’: యజ్ఞం చేయండి..భారత్ కు 3rd వేవ్ రానేరాదు : మంత్రిగారి వ్యాఖ్యలు

కరోనా థర్డ్ వేవ్ భారత్ కు రాకుండా ఉండాలంటే..యజ్ఞం చేయండి అంటూ పిలుపునిచ్చారు మధ్యప్రదేశ్ మంత్రి ఉషా ఠాకూర్. భారతదేశానికి కరోనా మూడో వేవ్ రాకుండా ఉండాలంటే ప్రజలు నాలుగు రోజుల పాటు యజ్ఞం చేయాలని పిలుపునిచ్చారు మంత్రి ఉషా ఠాకూర్.

‘Perform yagna’: యజ్ఞం చేయండి..భారత్ కు 3rd వేవ్ రానేరాదు : మంత్రిగారి వ్యాఖ్యలు

'perform Yagna’

Usha Thakur ‘Perform yagna..COVID third wave : కరోనా థర్డ్ వేవ్ భారత్ కు రాకుండా ఉండాలంటే..యజ్ఞం చేయండి అంటూ పిలుపునిచ్చారు ఓ మంత్రిగారు. కరోనా సెకండ్ వేవ్ తో మరణ మృదంగాలు మోగిస్తుంటే..ప్రజలకు వ్యాక్సిన్లు అందేలా చేయటం మానేసి యజ్ఞం చేయండి..యాగం చేయండీ..గోమూత్రం తాగండీ..గోవు పేడ రాసుకోండీ అంటూ సలహాలిస్తున్నారు నేతలు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ..భారతదేశానికి కరోనా మూడో వేవ్ రాకుండా ఉండాలంటే ప్రజలు నాలుగు రోజుల పాటు యజ్ఞం చేయాలని పిలుపునిచ్చారు మంత్రి ఉషా ఠాకూర్.

యూపీలోని ఇండోర్ నగరంలో కొవిడ్ కేర్ సెంటరును ప్రారంభించిన అనతరం మంత్రి ఉషాఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ..పర్యావరణ శుద్ధి కోసం నాలుగు రోజులు యజ్ఞం చేయండి. ఇది కరోనా ఖతం కావటానికి యజ్ఞ చికిత్స. పూర్వ కాలంలో, మన పూర్వీకులు మహమ్మారిని వదిలించుకోవడానికి యజ్ఞాలు చేసేవారు.దాంతో రోగాలు మటుమాయం అయిపోయేవి. ఇవి రోగాలు రాకుండా ఉండటానికి చేసే చికిత్స అంటూ చెప్పుకొచ్చారు.

యజ్ఞం పర్యావరణాన్ని శుద్ధి చేస్తోంది, దీనివల్ల కొవిడ్ మూడో వేవ్ భారతదేశాన్ని తాకదు’’ అంటూ మంత్రి ఉషా ఠాకూర్ వ్యాఖ్యానించారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం వల్ల కేసుల సంఖ్య పెరగడంతో ఫ్రంట్ లైన్ ఆరోగ్య కార్యకర్తలపై అధిక భారం పడుతుంది.కరోనా థర్డ్ వేవ్ పిల్లలపై దాడి చేయకుండా దీన్ని విజయవంతంగా అధిగమించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం పూర్తి సన్నాహాలు చేస్తోందని మంత్రి చెప్పారు. మంత్రి ఉషా ఇటీవల ఇండోర్ విమానాశ్రయంలో విగ్రహం ముందు కర్మలు చేసి వివాదాస్పదమయ్యారు. అలాగే గతంలో ఓ సారి కొవిడ్ సంరక్షణ కేంద్రాన్ని సందర్శించినపుడు మాస్కు ధరించలేదని విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు యజ్ఞం చేయండి కరోనా థర్డ్ వేవ్ రాదు అంటూ సలహాలు..సూచనలు ఇచ్చారు మంత్రిగారు..