60 ఏళ్లుగా సైకిల్ మీదే : పేదల ఇళ్లకు వెళ్లి కరోనా చికిత్స చేస్తోన్న 87 ఏళ్ల డాక్టర్

  • Published By: nagamani ,Published On : October 23, 2020 / 12:31 PM IST
60 ఏళ్లుగా సైకిల్ మీదే : పేదల ఇళ్లకు వెళ్లి కరోనా చికిత్స చేస్తోన్న 87 ఏళ్ల  డాక్టర్

Maharashtra:రోగుల చేయి కూడా పట్టుకుండానే డాక్టర్లు పైసాయే పరమాత్మ అన్నట్లు చేతిలో పైసలు పడితేనేగానీ రోగి చేయి కూడా ముట్టుకోని రోజులివి. చిన్నపాటి జలుబుతో హాస్పిటల్ కు వెళితే చాలా టెస్టులు అవీ ఇవీ అంటూ వేల రూపాయలు గుంజేస్తున్నారు. ఈ కరోనా కాలంలో అయితే ఇక చెప్పనే అక్కర్లేదు లక్షల రూపాయలు పిండేస్తున్నారు.


రోగులు వస్తే చాలా ఇక వారిజేబులే కాదు వారి బ్యాంక్ ఎకౌంట్లు కూడా ఖాళీ చేసేస్తున్నారు. ఇటువంటి దారుణ పరిస్థితుల్లో పేదలకు రోగమొస్తే అంతే సంగతులు. దేవుడిపై భారం వేసి బతికేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అటువంటివారికి ఆపద్భాంధవుడిలా సేవలు చేస్తున్నాడో డాక్టర్. డబ్బుల కోసం ఆశించడాయన. రోగులు బాగు పడితే చాలా అనుకునే పెద్ద మనస్సు ఆయనది.



https://10tv.in/maharashtras-women-child-development-minister-yashomati-thakur-gets-3-month-jail-term-by-maharashtra-court/
కానీ..కరోనా పేరుతో లక్షలు గుంజేసే ఈ కాలంలో కూడా మానవత్వాన్ని చూపే డాక్టర్లు కూడా ఉన్నారు. అటువంటి డాక్టర్ పేదలపాలిట భగవంతుడిలా మారాడు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాకు చెందిన ఆ డాక్టర్ పేరు రామ్‌చంద్ర దండేకర్. వయసు 87 ఏళ్లు. ఆ వయస్సులో కూడా ఆయన కనీసం కాళ్లకు చెప్పులు కూడా వేసుకోకుండా సైకిల్ మీదనే పేదల ఇళ్లకు వెళ్లి వైద్యం చేస్తున్నాడు.


రోగమొస్తే ఆసుపత్రిలో చేరలేక..వైద్యం చేయించుకునే స్తోమత లేక..ఇంటికి డాక్టర్ ని పిలిపించుకుని వైద్యం చేయించుకునే ఆర్థిక పరిస్థితి లేక పేదలు నానా కష్టాలు పడుతున్నారు. చాలా సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. మా ఖర్మ ఇంతేనని సరిపెట్టుకుంటూ బతికేస్తున్న దుర్భర స్థితుల్లో దేశంలో చాలామంది పేదలున్నారు. ముఖ్యంగా ఈ కరోనా పరిస్థితుల్లో మహారాష్ట్రలోని ఓ హోమియోపతి డాక్టర్ మాత్రం కరోనా బారినపడ్డ పేదలకు వైద్యం చేయడానికి తన 87 ఏళ్ల వయస్సులో కూడా ప్రతీరోజూ 10 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వెళుతున్నారు రామ్ చంద్ర దండేకర్.


వైద్యం చేసే రోగుల నుంచి డబ్బులు కూడా ఆశించడాయన. అంతేకాదు పేదల ఇంటికే వెళ్లి వైద్యం చేస్తున్నారు. వారు ఎంత దూరంలో ఉన్నా సరే తన సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి మరీ వైద్యం చేస్తున్నారు. ఈ కరోనా వచ్చిన సమయంలోనే కాదు.. గత 60 ఏళ్లుగా రామ్ చంద్ర తన సైకిలు పైనే రోగుల ఇంటికి వెళ్లి వైద్యం చేస్తున్నారు. పేద పాలిట భగవంతుడిలా మారారాయన.


ముల్, పోంభూర్ణ, బల్లర్షా తాలూకాల పరిధిలో ఉండే గ్రామాలకు ప్రతిరోజూ కనీసం 10 కిలోమీటర్ల దూరం చెప్పులు లేకుండా ప్రయాణిస్తు..పేద ప్రజలకు ఉచితంగానే చికిత్సను అందిస్తున్నారు రామ్ చంద్ర. ప్రపంచమంతా కరోనా భయంతో ప్రజలు ఇంటికే పరిమితమైపోయిన సమయంలో కూడా రామ్ చంద్ర ఇంటిలో ఏనాడు ఉండలేదు. తన సైకిల్ మీద పేదల ఇళ్లకు వెళ్లి వైద్యం చేయటం మానలేదు.



ఈ సందర్భంగా రామ్ చంద్ర మాట్లాడుతూ..డాక్టర్ అనేవారు తమకంటూ ఓ సమయం..భద్రత అని కూర్చోకూడదు. డాక్టర్ కోసం రోగులు ఎదురు చూడకూడదు. వైద్యం చేయించుకోని స్థితిలో చాలామంది ప్రజలు ఉండటం చాలా బాధాకరం. అటువంటి పేదలకు నా వంతుగా నా శాయశక్తులా చికిత్స అందిస్తూనే ఉంటాను…ఇది డాక్టర్ గా నా బాధ్యత..ఆ బాధ్యతను ఎప్పుడు మరచిపోయనని తెలిపారు. కరోనా వచ్చినా ఈ సమయంలో నా బాధ్యత మరింతగా పెరిగింది. పేదలకు నా అవసరం చాలా ఉంది. అందుకే కరోనా వచ్చినా నాకు వస్తుందని భయపడకుండా కరోనా వచ్చిన రోగులకు నా శాయశక్తులా చికిత్సనందిస్తున్నానని తెలిపారు.