కరోనా న్యూ వెర్షన్ విజృంభణ…మహారాష్ట్రలో 15 రోజులు నైట్ కర్ఫ్యూ

కరోనా న్యూ వెర్షన్ విజృంభణ…మహారాష్ట్రలో 15 రోజులు నైట్ కర్ఫ్యూ

Maharashtra imposes night curfew మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాల్లో డిసెంబర్-22 నుంచి జనవరి-5వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు సోమవారం(డిసెంబర్-21,2020)ఉద్దవ్ సర్కార్ ప్రకటించింది. 15 రోజుల పాటు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6గంటల వరకు నైట్ కర్ఫ్యూ ఉంటుందని అధికారులు తెలిపారు.

అయితే, బ్రిటన్ లో కరోనా “న్యూ వెర్షన్” విజృంభణ నేపథ్యంలోనే ముందుజాగ్రత్తగా మహా సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు,యూకే నుంచి వ‌చ్చే విమానాల‌పై భారత్ తాత్కాలికంగా నిషేధం విధించింది. డిసెంబర్‌ 31 వరకు అన్ని విమాన సర్వీసులపై నిషేధం విధించింది. రేపు అర్ధరాత్రి నుంచి నిషేధం అమలులోకి రానుంది.

ప్ర‌స్తుతం యూకే నుంచి వ‌స్తున్న విమానాల్లో ఉన్న ప్ర‌యాణికుల‌కు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా ఆర్టీ-పీసీఆర్ టెస్ట్‌ను త‌ప్ప‌నిస‌రి చేసిన‌ట్లు కేంద్ర విమాన‌యాన శాఖ తెలిపింది. ఇప్ప‌టికే యూకే నుంచి బ‌య‌లుదేరిన విమానాలు లేదా (డిసెంబ‌ర్ 22, 2020) రాత్రి 11.59 గంట‌ల‌లోపు వ‌చ్చే విమానాల్లో ప్ర‌యాణికుల‌కు ఈ టెస్ట్‌ను త‌ప్ప‌నిస‌రి చేశారు.