PDP chief: మాజీ సీఎం మెహబూబా హౌస్ అరెస్ట్

ఆమె స్పందిస్తూ అధికార పార్టీ నేతలు కశ్మర్ లోయంతా స్వేచ్ఛగా తిరుగుతున్నారని, అయితే తమను మాత్రం భద్రత పేరుతో ఇలా బంధించిడం ఏంటని ప్రశ్నించారు. బీజేపీ విధానాలు కశ్మీర్ ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, మూడేళ్ల క్రితం ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్ సాక్షిగా చేసిన వాగ్దానాలు ఉట్టి నేటి మూటలేనని మెహబూబా విమర్శలు గుప్పించారు.

PDP chief: మాజీ సీఎం మెహబూబా హౌస్ అరెస్ట్

Mehabooba mufti house arrested in srinagar

PDP chief: జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధినేత మెహబూబా ముఫ్తీని ఆదివారం హౌస్ అరెస్ట్ చేశారు. షెడ్యూల్ ప్రకారం.. షోపియాన్ జిల్లాలోని ఛోటిగామ్‭కు ఆమె వెళ్లాల్సి ఉండగా.. బయటికి వెళ్లనీయకుండా శ్రీనగర్‭లోని ఆమె నివాసంలోనే గృహనిర్భందించారు. కొద్ది రోజుల క్రితం ఛోటిగామ్‭లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో సునిల్ కుమార్ అనే కశ్మీరీ పండిట్ దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. అయితే సునిల్ కుటుంబాన్ని పరామర్శించేందుకే ఆమె ఛోటిగామ్ వెళ్లనున్నారు.

అయితే పోలీసులు ఇలా అడ్డుకోవడంపై మెహబూబా ముఫ్తీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, తీరు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని, సమస్యను మరింత జటిలం చేస్తూ కశ్మీర్‭లో తీవ్ర పరిణామాలకు కారణం అవుతున్నారని ఆమె మండిపడ్డారు. ఈ విషయమై ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘భారత ప్రభుత్వం కారణంగానే కశ్మీర్ పండిట్లు దయనీయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. వారు ఎక్కడికైనా వెళ్లాలనుకున్నా వెళ్లనీయకుండా చేస్తున్న కేంద్ర విధానాల వల్ల టార్గెట్ హత్యలకు కశ్మీర్ పండిట్లు గురవుతున్నారు. ఇవాళ నన్ను గృహనిర్బంధంలో ఉంచాల్సిన అవసరం ఏమొచ్చింది?” అని ఆమె మండిపడ్డారు.

ఇంకా ఆమె స్పందిస్తూ అధికార పార్టీ నేతలు కశ్మర్ లోయంతా స్వేచ్ఛగా తిరుగుతున్నారని, అయితే తమను మాత్రం భద్రత పేరుతో ఇలా బంధించిడం ఏంటని ప్రశ్నించారు. బీజేపీ విధానాలు కశ్మీర్ ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, మూడేళ్ల క్రితం ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్ సాక్షిగా చేసిన వాగ్దానాలు ఉట్టి నేటి మూటలేనని మెహబూబా విమర్శలు గుప్పించారు.

Himachal assembly polls: ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఝలకిచ్చిన ఆనంద్ శర్మ