టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ 

  • Published By: murthy ,Published On : May 20, 2020 / 02:23 PM IST
టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ 

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించుకునేందుకు కేంద్రం రాష్ట్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెద్ద సంఖ్యలో విద్యార్ధులు పరీక్షలకు సన్నధ్ధమవుతున్నందున వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈనిర్ణయం తీసుకుందని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా  వెల్లడించారు.

అయితే పరీక్షా కేంద్రాల్లోనూ  విద్యార్ధుల మధ్య భౌతిక దూరం,  ఫేస్ మాస్క్ తప్పని సరి అన స్పష్టం చేశారు. అయితే.. కంటైన్మెంట్ జోన్లలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయ వద్దని రాష్ట్రాలకు కేంద్రం  సూచించింది. 

టీచర్లు, సిబ్బంది, విద్యార్థులు ఫేస్ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని నిబంధన పెట్టింది. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులను తరలించేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. ఈ నిర్ణయానికి సంబంధించి కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాల సీఎస్‌లకు లేఖ రాశారు.