మిజోరాంలో మద్యపాన నిషేధం : కేబినెట్ ఆమోదం

  • Published By: veegamteam ,Published On : March 9, 2019 / 11:01 AM IST
మిజోరాంలో మద్యపాన నిషేధం : కేబినెట్ ఆమోదం

ఐజ్వాల్ : మిజోరం కేబినెట్ మద్య నిషేధ బిల్లుకు ఆమోదం పలికింది. మార్చి 8న సీఎం జొరంతంగ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ సమావేశంలో మిజోరం మద్య నిషేధ బిల్లు 2019 ను ఆమోదించింది. ఈ బిల్లును మార్చి 20 నుంచి బడ్జెట్ సెషన్ లో ప్రవేశపెడతామని ఓ అధికారి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు తాము ఇచ్చిన మాటను నిలుపుకుంటామని అధికారంలోకి వచ్చిన మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) హామీ ఇచ్చింది. మిజోరంలో 1997 నుండి జనవరి 2015 వరకు మిజోరాం లో మద్యపాన నిషేధం ఉంది.
Read Also : అమ్మ పోయాక మోడీనే నాన్నయ్యారు

అనంతరం కాంగ్రెస్ పార్టీ తరపున అధికారంలోకి వచ్చిన సీఎం లాల్ తన్హావ్లా పాలనలో తిరిగి మార్చి 2015 నుండి రాష్ట్రంలో వైన్ దుకాణాలను ప్రారంభించింది. ఈ క్రమంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన మిజో నేషనల్ ఫ్రంట్ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారమే సీఎం జొరంతంగ ప్రభుత్వం మద్యపాన నిషేధానికి కేబినెట్ ఆమోదం పలికింది. 
Read Also : లోకేష్ ఎందుకు మాట్లాడటం లేదు.. ఆయన డిపార్ట్ మెంటే కదా : బుగ్గన