MLA Dance: వైరల్‌: క్వారంటైన్‌లో ఎమ్మెల్యే చిందులు

MLA Dance: వైరల్‌: క్వారంటైన్‌లో ఎమ్మెల్యే చిందులు

Mla Dance

MLA Dance: దేశంలో సెకండ్ వేవ్ ప్రభావం అధికంగా ఉంది. ప్రతి రోజు లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశంలోని అన్ని ఆసుపత్రులు కరోనా రోగులతో కిటకిటలాడుతున్నాయి. కొన్ని చోట్ల బెడ్ల కొరత ఉంది. పలు చోట్ల ఆక్సిజన్ కొరత ఇంకా తీరలేదు. ఇక ఇదిలా ఉంటే కరోనా రోగుల్లో ఉత్సాహం నింపేందుకు వైద్యులు కృషి చేస్తున్నారు. కరోనా వార్డులలో డాన్స్ చేస్తూ రోగుల్లో ఉల్లాసంగా ఉండేలా చూస్తున్నారు.

ఇక ఈ నేపథ్యంలోనే కరోనా రోగుల్లో ఉత్సాహం నింపేందుకు కర్ణాటకలోని మలవాలీ ఎమ్మెల్యే అన్నదాని క్వారంటైన్‌ కేంద్రంలో డాన్స్ చేశారు. వేదిక మీద సరదాగా చిందులేశారు. ఎమ్మెల్యే డాన్స్ చూసి కరోనా రోగులు ఆనందం వ్యక్తం చేశారు. స్వతహాగా జానపద గాయకుడు, కళాకారుడు అయిన అన్నదాని మాట్లాడుతూ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో రోగులు ఉల్లాసంగా ఉండాలని తెలిపారు.