బీహార్ బాహుబలి: అతనిపై 67క్రిమినల్ కేసులు.. ఐదవసారి ఎమ్మెల్యేగా గెలిచాడు

  • Published By: vamsi ,Published On : November 11, 2020 / 11:57 AM IST
బీహార్ బాహుబలి: అతనిపై 67క్రిమినల్ కేసులు.. ఐదవసారి ఎమ్మెల్యేగా గెలిచాడు

బీహార్ అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలు మంగళవారం అర్థరాత్రి వచ్చాయి. రాష్ట్రంలో మరోసారి ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది. బీహార్‌లోని 243 సీట్లలో, ఈసారి చాలా మంది బాహుబలిస్ గెలిచారు, అందులో అనంత్ సింగ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. బీహార్‌లోని మోకామా సీటు నుంచి పోటీ చేసిన అనంత్ సింగ్ తన ప్రత్యర్థి జేడీయూకి చెందిన రాజీవ్ లోచన్‌ను ఓడించారు.



అనంత్ సింగ్ రాజీవ్ లోచన్ నారాయణ్ సింగ్ (42964 ఓట్లు) ను 35757 ఓట్ల తేడాతో ఓడించారు. ఈ విధంగా, అనంత్ సింగ్ ఐదవసారి మోకామా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంత్ సింగ్‌ ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం ఆయన నేరచరిత్ర చాలా ఎక్కువగానే ఉంది. 1979లో అతనిపై తొలిసారి హత్య కేసు అభియోగాలు నమోదయ్యాయి. ఆయనపై మొత్తం 67 క్రిమిన‌ల్ కేసులు ఉన్నాయి. మోకామా నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆర్జేడీ త‌ర‌పున పోటీ చేసిన ఆయన 2015 ఎన్నిక‌ల్లో మాత్రం స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేసి గెలిచారు. అంతకుముందు అనంత్ సింగ్ తన ఇంట్లో ఏకే 47 తుపాకీ ల‌భ్యం కావ‌డంతో జైలు పాల‌య్యారు.



2015 ఎన్నిక‌ల కంటే ముందు పాట్నాలోని అనంత్ సింగ్ నివాసంలో పోలీసులు సోదాలు జరపగా.. ఆరు మ్యాగ‌జైన్లు, రైఫిల్స్, ర‌క్త‌పు మ‌ర‌క‌లు అంటిన దుస్తులు ఉన్నాయి. వీటితో పాటు కిడ్నాప్, హ‌త్య కేసుల్లో అనంత్ జైలుకు వెళ్లాడు. అనంత్ సింగ్‌ను స్థానికంగా చోటే స‌ర్కార్ అని పిలుస్తారు. అనంత్ సింగ్ తొలిసారిగా 2005లో మోకామా నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ త‌ర్వాత 2010, 2015, 2020 ఎన్నిక‌ల్లో గెలిచారు.



https://10tv.in/president-declines-time-to-punjab-cm-amarinder-singh-to-begin-relay-dharna/
ఎన్నిక‌ల ఆఫిడ‌విట్ ప్ర‌కారం.. 2005 వరకు ఆయన ఆస్తుల విలువ రూ .2 లక్షలు, వంద గ్రాముల బంగారం. అయితే ఎమ్మెల్యే అయిన 15 సంవత్సరాలలో మొత్తం ఆస్తులు 9 కోట్ల 64 లక్షలకు పెరిగాయి. దీనిలో స్థిరమైన ఆస్తి విలువ 56 లక్షలు. వారసత్వంగా అతనికి 27 లక్షల 50 వేల ఆస్తులు వచ్చాయి. వారిపై ప్రభుత్వ బకాయిలు 7 లక్షల 59 వేలు. కాగా బ్యాంకు రుణం 40 లక్షలు ఉంది. అనంత్ సింగ్ పై 67 క్రిమిన‌ల్ కేసులు ఉన్నాయి.



బీహార్‌లో మినీ కోల్‌కతాగా పిలువబడే మోకామా 80వ దశకం వరకు పరిశ్రమ, వాణిజ్యం, విద్య, ఆరోగ్యం మరియు రవాణాకు ప్రధాన కేంద్రంగా ఉంది.