Satya Pal Malik on MSP: ప్రధాని మోదీపై మరోసారి విరుచుకుపడ్డ మేఘాలయ గవర్నర్
సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడాదిపాటు ఆందోళన చేపట్టారు. స్వాతంత్ర్యం అనంతరం దేశంలోనే సుదీర్ఘంగా అత్యంత సుదీర్ఘ నిరసనల్లో ఇది ఒకటి. అయితే ప్రభుత్వం తీసుకువచ్చిన సాగు చట్టాల్ని రద్దు చేసుకుంటున్నట్లు గతేడాది నవంబర్ 19 ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. మోదీ హామీతో రైతులు ఆందోళన విరమించినప్పటికీ కనీస మద్దతు ధరపై చట్టబద్ధమైన హామీ కోసం పోరాడతామని ప్రకటించారు. ఆ విషయమై రైతులు ఇంకా నిరసనలు చేస్తూనే ఉన్నారు.

MSP is not being implemented because PM has a friend whose name is Adani says Satya Pal Malik
Satya Pal Malik on MSP: సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన చేపట్టిన నాటి నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కేంద్ర ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేస్తున్న మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మరోసారి మోదీపై విరుచుకుపడ్డారు. రైతులకు ఇవ్వాల్సిన కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టేయడానికి కారణం.. నరేంద్రమోదీకి బడా వ్యాపారవేత్త గౌతమ్ అదాని స్నేహితుడు కావడం వల్లేనని ఆయన వ్యాఖ్యానించారు. విపక్షాలను బెదిరించినట్లు రైతులను బెదిరించడమో, భయపెట్టడమో ప్రభుత్వం వల్ల కాదని, వారిపైకి ఈడీ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని పంపి లొంగదీసుకోలేరని సత్యపాల్ మాలిక్ అన్నారు.
సోమవారం ఈ విషయమై స్పందిస్తూ ‘‘రైతులకు దక్కాల్సిన, ప్రభుత్వం ఇవ్వాల్సిన కనీస మద్దతు ధర అమలులోకి రాకపోవడానికి కారణం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అదాని అనే స్నేహితుడు ఉండడం. ఆయనే ఐదేళ్లలో ఆసియాలో అత్యంత ధనవంతుడు అయ్యాడు. ఎలా అయ్యాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు’’ అని అన్నారు. ఇక విపక్షాలను భయపెట్టి లొందగిసుకున్నట్లు రైతుల్ని చేయలేరని ఆయన అన్నారు. ‘‘రైతుల్ని ఓడించలేరు. వారిని భయపెట్టనూ లేరు. వారిపైకి ఈడీని ఆదాయపు పన్ను శాఖ అధికారుల్ని పంపలేరు. మరి వారిని ఇంకే విధంగా భయపెడతారు?’’ అని సత్యపాల్ మాలిక్ అన్నారు.