Manish Sisodia : నేను మహారాణా ప్రతాప్ వంశస్తుడిని రాజ్ పుత్ ని..తల నరుక్కుంటాను కానీ .. అవినీతిపరుల ముందు తలవంచను

బీజేపీకి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నేను మహారాణా ప్రతాప్ వంశస్తుడిని రాజ్ పుత్ ని..తల నరుక్కుంటా తప్ప అవినీతికి తలవంచను అంటూ స్పష్టం చేశారు. ఏం చేయాలనుకుంటున్నారో చేస్కోండీ నేను బెదిరేది లేదు అంటూ స్పష్టం చేశారు.

Manish Sisodia : నేను మహారాణా ప్రతాప్ వంశస్తుడిని రాజ్ పుత్ ని..తల నరుక్కుంటాను కానీ .. అవినీతిపరుల ముందు తలవంచను

Delhi Deputy CM Manish Sisodia Strong Warning to BJP

Manish Sisodia : లిక్కర్ పాలసీ స్కాం విషయంలో డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇంటిపై సీబీఐ దాడులు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మనీశ్ సిసోడియా తీవ్రంగా మండిపడ్డారు. తనపై బీజేపీ లేనిపోని అభాండాలువేస్తోందని..టార్గెట్ చేసి మరీ దాడులు చేయిస్తోంది అంటూ విమర్శించారు. ఈక్రమంలో మరోసారి బీజేపీ ప్రభుత్వంపై మండి పడ్డ ఆయన బీజేపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నేను మహారాణా ప్రతాప్ వంశస్తుడిని రాజ్ పుత్ ని..తల నరుక్కుంటా తప్ప అవినీతిపరులు ముందు తలవంచను అంటూ స్పష్టం చేశారు. నాపై పెట్టిన కేసులన్నీ ఫేక్ అని బీజేపీ తనను టార్గెట్ చేసి ఇబ్బందులకు గురిచేస్తోంది అంటూ ఆరోపించారు. ఏం చేయాలనుకుంటే అది చేసుకోండి నేనేమీ బెదిరేది లేదు..న్యాయపరంగా పోరాటం చేస్తాను అంటూ స్పష్టం చేశారు.లిక్కర్ స్కామ్ అంటూ తనపై లేని పోని ఆరోపణలు చేసి నన్ను అరెస్ట్ చేయాలని బీజేపీ కుట్రలు పన్నుతోంది అని ఆరోపించారు. బీజేపీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని..బీజేపీలో చేరితే సీబీఐ, ఈడీ కేసులు ఎత్తివేస్తామని తనకు మెసేజ్ లు వ్తున్నాయని తల అయినా నరుక్కుంటాను తప్ప బీజేపీలో చేరేది లేదని సిసోడియా స్పష్టం చేశారు.

Also read : CBI Raids: నేను ఎక్కడున్నానో తెలియట్లేదా?.. ఎక్కడికి రావాలో చెప్పండి మోదీ జీ: లుకౌట్ నోటీసులపై మనీశ్ సిసోడియా

లిక్కర్ స్కామ్ అంశంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో పాటు మరో 12 మందికి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) లుకౌట్ నోటీసు జారీ చేసింది. వారందరూ దేశం విడిచి వెళ్ళకుండా ఆంక్షలు విధించింది. ఢిల్లీ ప్రభుత్వ మద్యం పాలసీలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ కేసులోనే సీబీఐ దాడులు జరిగాయి. సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌లో మొత్తం 15 మంది పేర్లను పేర్కొంది సీబీఐ.

సీబీఐ తనకు లుకౌట్ నోటీసు పంపించడం పట్ల ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా స్పందించారు. ‘మీరు చేసిన దాడులు అన్నీ విఫలమయ్యాయి. దాడుల్లో మీకు ఏమీ దొరకలేదు. ఒక్క రూపాయి కూడా లభ్యం కాలేదు. ఇప్పుడు మీరు లుకౌట్ నోటీసు జారీ చేశారు. నేను కనపడట్లేనని అంటున్నారు. మోదీజీ ఏమిటీ ఈ గిమ్మిక్కు. నేను ఢిల్లీలో స్వేచ్ఛగా తిరుగుతున్నాను. నేను ఎక్కడున్నానో తెలియట్లేదా? నేను ఎక్కడికి రావాలో చెప్పండి మోదీ జీ’ అని మనీశ్ సిసోడియా ట్వీట్లు చేశారు.

Also read : CBI Raids: దేశం విడిచి వెళ్ళొద్దు.. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాతో పాటు మరో 12 మందికి సీబీఐ లుకౌట్ నోటీసు

ఈక్రమంలో మనీశ్ తనను టార్గెట్ చేసిన బీజేపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నేను మహారాణా ప్రతాప్ వంశస్తుడిని రాజ్ పుత్ ని..తల నరుక్కుంటా తప్ప అవినీతికి తలవంచను అంటూ స్పష్టం చేశారు. మీరు నన్ను ఏం చేయాలనుకుంటే అది చేసుకోండి నేనేమీ బెదిరేది లేదు..అంటూ స్పష్టం చేశారు.