CBI Raids: దేశం విడిచి వెళ్ళొద్దు.. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాతో పాటు మరో 12 మందికి సీబీఐ లుకౌట్ నోటీసు

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో పాటు మరో 12 మందికి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) లుకౌట్ నోటీసు జారీ చేసింది. వారందరూ దేశం విడిచి వెళ్ళకుండా ఆంక్షలు విధించింది. మనీశ్ సిసోడియా ఇంటిపై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) అధికారులు ఇటీవల సోదాలు చేసిన విషయం తెలిసిందే. అలాగే, మరో 30 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు దాడులు చేశారు. ఢిల్లీ ప్రభుత్వ మద్యం పాలసీలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ కేసులోనే సీబీఐ  దాడులు జరిగాయి.

CBI Raids: దేశం విడిచి వెళ్ళొద్దు.. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాతో పాటు మరో 12 మందికి సీబీఐ లుకౌట్ నోటీసు

CBI Raids

CBI Raids: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో పాటు మరో 12 మందికి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) లుకౌట్ నోటీసు జారీ చేసింది. వారందరూ దేశం విడిచి వెళ్ళకుండా ఆంక్షలు విధించింది. మనీశ్ సిసోడియా ఇంటిపై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) అధికారులు ఇటీవల సోదాలు చేసిన విషయం తెలిసిందే. అలాగే, మరో 30 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు దాడులు చేశారు. ఢిల్లీ ప్రభుత్వ మద్యం పాలసీలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ కేసులోనే సీబీఐ  దాడులు జరిగాయి. సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌లో మొత్తం 15 మంది పేర్లను పేర్కొన్నారు.

వారిలో 13 మందికే ఇవాళ లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. దేశంలో ప్రతిపక్ష పార్టీలను భయపెట్టేందుకే దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తోందంటూ కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. సీఎం కేజ్రీవాల్ ను అడ్డుకునేందుకే మద్యం పాలసీలో కుంభకోణం జరిగిందంటూ బీజేపీ హడావుడి చేస్తోందని మనీశ్ సిసోడియా కూడా ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) లేదా ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తనను మూడు-నాలుగు రోజుల్లో అరెస్టు చేసే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని రద్దుచేసి, పాత విధానాన్ని మళ్ళీ తీసుకొచ్చింది. కొన్ని నెలల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో ఆ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో మనీశ్ సిసోడియా ఇంటిపై దాడులు జరగడం గమనార్హం.

Virushka scooty ride: అనుష్మను ఎక్కించుకుని ముంబైలో స్కూటీపై చక్కర్లు కొట్టిన విరాట్ కోహ్లీ