Mumbai Drug Case : ఆర్యన్‌‌కు బెయిల్ వచ్చేనా ?

డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన బాలీవుడ్ సూపర్‌స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ కు బెయిల్ వస్తుందా ? లేదా అనేది కాసేపట్లో తెలియనుంది.

10TV Telugu News

Aryan Khan Bail : డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన బాలీవుడ్ సూపర్‌స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ కు బెయిల్ వస్తుందా ? లేదా అనేది కాసేపట్లో తెలియనుంది. 2021, అక్టోబర్ 14వ తేదీ గురువారం బెయిల్‌ విచారణ జరగనుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ కేసు విచారణ కొనసాగనుంది. ఆర్యన్‌ఖాన్‌కు అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠాతో సంబంధాలు ఉన్నట్లు NCB కోర్టుకు తెలిపింది. తమ విచారణలో ఈ విషయం బహిర్గతమైనట్లు పేర్కొంది. అయితే పట్టుబడిన సమయంలో అతడి వద్ద ఎలాంటి డ్రగ్స్‌ దొరకలేదని స్పష్టం చేసింది.

Read More : Sharukh Khan : షారుఖ్ పార్టీలో డ్రగ్స్.. బాలీవుడ్ స్టార్ భార్యలు సైతం..

అయితే డ్రగ్స్‌ ముఠాతో సంబంధాలున్న వ్యక్తికి బెయిల్ ఇవ్వడం వల్ల దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందని కోర్టుకు తెలిపింది.  ఆర్యన్‌ఖాన్‌ తరఫున వాదించిన సీనియర్‌ న్యాయవాది అమిత్‌ దేశాయ్‌ NCB వాదనలకు కౌంటర్‌ ఇచ్చారు. NCB దాడి చేసిన సమయంలో రేవ్‌ పార్టీ జరుగుతున్న క్రూజ్‌ నౌకలోనే అసలు ఆర్యన్‌ లేడని వాదించారు.

Read More : Sharukh khan : డ్రగ్స్ కేసులో షారుఖ్ ఖాన్ కొడుకు అరెస్ట్

పార్టీకి వెళుతుండగా ఆర్యన్‌తోపాటు మరో వ్యక్తి అర్బాజ్‌ను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. అర్బాజ్‌ వద్ద 6 గ్రాముల చరాస్‌ దొరికినట్లు వెల్లడించారు. ఆ సమయంలో ఆర్బాత్‌తో ఆర్యన్‌ ఉండడంతోనే NCB అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. ఆర్యన్‌ దగ్గర క్యాష్‌ కూడా దొరకలేదన్నారు. ఆర్యన్‌ వద్ద నగదే లేనపుడు షిప్‌లో డ్రగ్స్‌ ఎలా కొంటాడన్నారు.

Read More : Krishna-Godavari Boards : కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులు.. గెజిట్ నోటిఫికేషన్ అమలుపై డైలమా

షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ కోసం కొత్త అడ్వకేట్ ను షారూఖ్ నియమించుకున్నట్లు సమాచారం. 2002లో ఓ కేసు నిమిత్తం సల్మాన్ ఖాన్ తరపు వాదించిన న్యాయవాది అమిత్ దేశాయ్ ను షారుఖ్ ఆశ్రయించినట్లు తెలుస్తోంది.