Maharashtra: మహారాష్ట్రలో మరింత ముదిరిన రాజకీయం వివాదం.. పోటాపోటీగా రోడ్డేక్కిన అధికార-విపక్షాలు

వీరికి పోటీగా అన్నట్లు అధికారంలోని నేతలు అదే ముంబైలో శనివారం రోజే నిరన చేపట్టారు. డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జన్మ స్థలాన్ని శివసేన (ఉద్ధవ్) సీనియర్ నేత సంజయ్ రౌత్ తప్పుగా వ్యవహరించడాన్ని వ్యతిరేకిస్తూ ‘మాఫీ మాంగో ఆందోళన్’ చేపట్టింది బీజేపీ. ఈ నిరసనలో షిండే వర్గం శివసేన నేతలు కూడా పాల్గొన్నారు

Maharashtra: మహారాష్ట్రలో మరింత ముదిరిన రాజకీయం వివాదం.. పోటాపోటీగా రోడ్డేక్కిన అధికార-విపక్షాలు

Mumbai is battleground for MVA, BJP rallies

Maharashtra: మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండవు. ఒక వివాదం ముగిసిందనేలోపే మరో వివాదం మొదలవుతుంది. లేదంటే, పాత వివాదాలే మళ్లీ మళ్లీ తెరపైకి వస్తుంటాయి. దాదాపుగా దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయాల్లో ఇది సర్వసాధారణమే అయినా, మహారాష్ట్రలో ఈ డోసు కాస్త ఎక్కువగా ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు వచ్చే ట్విస్ట్‭లు కూడా ఊహకందనట్టుగా ఉంటాయి. 25 ఏళ్లపాటు బీజేపీతో చెలిమి చేసిన శివసేన పార్టీ బీజేపీ నుంచి విడిపోతుందని ఎవరైనా ఊహించారా? అలాగే పార్టీ స్థాపన నుంచి కాంగ్రస్‭ అంటేనే ఒంటి కాలిపై లేచే అదే పార్టీ హస్తం కలుపుతుందని అనుకున్నారా? రాజకీయాల్లో శాశ్వత మిత్రువులు, శాశ్వత శత్రువులు ఉండరనేది నిజమే అయినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా మారి, బీజేపీకి శత్రువుగా శివసేన అవతరిస్తుందనేది మాత్రం రాజకీయ విమర్శకులు కూడా ఊహించని పరిణామమే.

2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన శివసేన.. కొద్ది రోజుల క్రితం అధికారాన్ని కోల్పోయింది. శివసేనే చీలి.. షిండే వర్గం బేషరతుగా వెళ్లి బీజేపీతో చేతులు కలిపింది. ఇన్నాళ్లు మహారాష్ట్ర అంటే రైట్ వింగ్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా ఉండేది. కానీ నేటి పరిస్థితులు శివసేన వర్సెస్ శివసేనగా మారిపోయాయి. ఈ రెండు వర్గాల మధ్య కొనసాగుతున్న పోరుతో మహారాష్ట్ర రాజకీయం అట్టడుకుతోంది. తరుచూ ఏదో తగువుతో ఇరు వర్గాలు ఘర్షణకు దిగుతూనే ఉన్నారు.

Emergency in 1975: కోర్టులకు ఉన్న ఆ లక్షణమే ఎమర్జెన్సీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడింది: సీజేఐ డీ.వై చంద్రచూడ్

భౌతిక, మాటల యుద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంతలో నిరసన యుద్ధం ప్రారంభించారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్‭పై మహారాష్ట్ర గవర్నర్ భగత్‭సింగ్ కోశ్యారీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ అలాగే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్‭పై రాష్ట్ర మంత్రి, బీజేపీ నేత చేసి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘హల్లా బోల్’ పేరుతో మహా వికాస్ అగాడీ (కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన) శనివారం ముంబైలో భారీ ర్యాలీ చేపట్టింది. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీని తొలగించాలని, అదే విధంగా ముఖ్యమంత్రి ఏక్‭నాథ్ షిండే రాజీనామా చేయాలంటూ వీరు డిమాండ్ చేశారు.

Iran: హిజాబ్ వ్యతిరేక నిరసనలో పాల్గొన్నందుకు ఆస్కార్ విన్నింగ్ మూవీ నటిని అరెస్ట్ చేసిన ఇరాన్

ఇక వీరికి పోటీగా అన్నట్లు అధికారంలోని నేతలు అదే ముంబైలో శనివారం రోజే నిరన చేపట్టారు. డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జన్మ స్థలాన్ని శివసేన (ఉద్ధవ్) సీనియర్ నేత సంజయ్ రౌత్ తప్పుగా వ్యవహరించడాన్ని వ్యతిరేకిస్తూ ‘మాఫీ మాంగో ఆందోళన్’ చేపట్టింది బీజేపీ. ఈ నిరసనలో షిండే వర్గం శివసేన నేతలు కూడా పాల్గొన్నారు. అగ్ర నేతలు రావడం వల్ల మహా వికాస్ అగాఢీ చేపట్టిన ర్యాలీ కాస్త హైలైట్‭గా కనిపించినప్పటికీ, అధికార పార్టీ చేపట్టిన ర్యాలీ కూడా పెద్ద ఎత్తునే జరిగినట్లు ముంబై మీడియా పేర్కొంది.