ముంబై: 11 నెలల్లో 900 మంది ప్రాణాలు తీసుకున్నారు

ముంబై: 11 నెలల్లో 900 మంది ప్రాణాలు తీసుకున్నారు

In Mumbai 900 People loses their lives: దేశ వాణిజ్య రాజధానిగా పేరొందిన ముంబై మహానగరంలో 11 నెలల కాలంలో 900 మంది ఆత్మహత్యలకు పాల్పడినట్లు తేలింది. గతంలో నమోదైన కేసులతో పోలిస్తే..ఆత్మహత్య కేసుల్లో ఈసారి 14 శాతం మేర తగ్గుదల నమోదైందని పోలీసులు వెల్లడించారు. జనవరి నుంచి నవంబర్ మధ్య వీరు సూసైడ్‌కు పాల్పడ్డారని తెలిపారు. లాక్ డౌన్ సమయంలో సంభవించినట్లు పోలీసులు విడుదల చేసిన నివేదికలో వెల్లడించారు.

19 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు ఎక్కువ మంది ఉండగా..10 శాతం సీనియర్ సిటిజన్లు ఉన్నారని వెల్లడించారు. నగరంలో పూర్తిగా లాక్ డౌన్ విధించిన సమయంలో..371 మంది ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు నివేదిక వెల్లడిస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా..విధించిన లాక్ డౌన్ వల్ల..వివిధ నగరాల్లో చాలా మంది చిక్కుకపోయారని, యువతీ, యువకులపై ప్రభావం చూపెట్టిందని Dr Avinash De Sousa తెలిపారు.

కరోనా కారణంగా..చాలా మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోవడంతో ఆర్థికంగా నష్టపోవడం, కష్టపడ్డారన్నారు. సామాజికంగా వీరికి మద్దతు లేకపోవడం, ఒంటరితనం, ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టారన్నారు. లాక్ డౌన్ సమయంలో బానిసలుగా మారిన వారు..మద్యం, మాదకద్రవ్యాలను పొందలేకపోవడంతో ఒత్తిడికి గురయ్యారని Dr Sagar Mundada (psychiatrist and de-addiction expert) పేర్కొన్నారు.

19 నుంచి 30 సంవత్సరాల వయస్సులో ఉన్న యువతీ యువకుల్లో చాలామంది నగరాల్లో కుటుంబాలకు దూరంగా ఉంటున్నారని, ఉద్యోగాలు, ఉపాధి కోల్పోవడంతో కొందరు తమ కెరీర్‌లో మానసికంగా కుంగిపోయారన్నారు. సమస్యను గుర్తించి వెంటనే కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా ఆత్మహత్యలను అరికట్టవచ్చని Dr Avinash De Sousa (సైకియాట్రిస్ట్) సూచిస్తున్నారు.