Mumbai Rider girl Vishakha: బైక్‌ నడిపితే ఈ విడ్డూరం ఏంటమ్మా! అని నోరెళ్ల బెడతారు

యువకులకు పోటీగా యువతులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అవకాశాలను అందిపుచ్చుకొని ఎవరు సాహసం చెయ్యని దారుల్లో వెళ్తున్నారు. తమ కలను సహకారం చేసుకునేందుకు ఎంతటి అవరోధాలనైనా అధిరోహిస్తూ ముందుకు వెళ్తున్నారు కొందరు యువతులు

Mumbai Rider girl Vishakha: బైక్‌ నడిపితే ఈ విడ్డూరం ఏంటమ్మా! అని నోరెళ్ల బెడతారు

Mumbai Rider Girl Vishakha

Mumbai Rider girl Vishakha:  యువకులకు పోటీగా యువతులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అవకాశాలను అందిపుచ్చుకొని ఎవరు సాహసం చెయ్యని దారుల్లో వెళ్తున్నారు. తమ కలను సహకారం చేసుకునేందుకు ఎంతటి అవరోధాలనైనా అధిరోహిస్తూ ముందుకు వెళ్తున్నారు కొందరు యువతులు.. ఆ కోవకు చెందిన యువతే ముంబైకి చెందిన విశాఖ. ఈమె బైక్ రైడింగ్ లో అబ్బాయిలతో పోటీపడుతోంది. అబ్బాయిలకు తీసిపోకుండా రైడింగ్ లో రాణిస్తున్న విశాఖను ముద్దుగా రైడింగ్ గర్ల్ విశాఖ అని పిలుచుకుంటారు.

ఈమె దేశంలోనే మొట్టమొదటి ‘మోటో వ్లాగర్‌’.. ఈమె దేశంలోని అనేక ప్రాంతాలకు బైక్ పైనే వెళ్తుంది. ఆలా దేశ యాత్ర చేస్తూ వీడియోలు తీసి యూ ట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ లక్షల మంది ఫాలోవర్స్ ని సంపాదించారు. విశాఖ అసలు పేరు విశాఖ ఫుల్‌సుంగి. ముంబైలో పుట్టిన విశాఖ పదేళ్లకే సైకిల్ తొక్కడం నేర్చుకుంది. 12 ఏళ్లకే స్కూటర్, 14 ఏళ్లకు హీరో హోండా ఫ్యాషన్ బండి నేర్చుకుంది. తన స్నేహితుల్లో ఎక్కువమంది అబ్బాయిలు ఉండటంతో ఆమె వాళ్లతో కలిసి రైడింగ్ కి వెళ్ళేది. ఆలా 15 ఏళ్లకే స్నేహితులతో పోటీ పడి బైక్ నడిపేది.

పేద కుటుంబంలో పుట్టిన విశాఖ పదోతరగతి పూర్తీ కాగానే ఓ బేకరీలో క్యాషియర్ ఉద్యోగంలో చేరింది. కానీ 15 రోజులు మాత్రమే ఆ ఉద్యోగం చేసింది. తర్వాత పంపేట్లు పంచింది. చిన్నచిన్న జాబ్‌లు చేస్తూనే ఇంటర్నేషనల్‌ బిజినెస్, మార్కెటింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌లో ఎంబీఏ పూర్తిచేసింది. ఇక రైడింగ్ మీద ఉన్న ఆసక్తితో 2015లో పుస్తెల తాడు తాకట్టుపెట్టి బైక్ కొనుక్కుంది. ఆ బైక్ కు కాశీష్ అని నామకరణం చేసింది.

చిన్న చిన్న రేస్ లలో పాల్గొంటూ మోటోవ్లాగింగ్‌ పై దృష్టిపెట్టింది. ఆలా 2017 లో సొంత యూట్యూబ్ చానల్ ను ప్రారంభించింది. ఆలా దేశ వ్యాప్త పర్యటనకు నడుంబిగించింది.. తన బైక్ తీసుకోని బయలుదేరింది. బంగాళాఖాతం దాటి అండమాన్‌ దీవుల వరకు ప్రయాణించిన విశాఖ.. మూడుసార్లు లడఖ్, స్పితి, రాజస్థాన్, కన్యాకుమారి, కేరళ, రామేశ్వరం, గోవా, గుజరాత్, ఢిల్లీ, పంజాబ్, మహారాష్ట్రలలోని పలుప్రాంతాలను పర్యటించింది. నర్మదా నదీ పరివాహక ప్రాంతం మొత్తాన్ని ఎనిమిదిరోజుల్లో చుట్టి వచ్చింది. రెండు ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డులను సొంతం చేసుకుంది.

విశాఖ తన జీవిత విశేషాలను పంచుకుంటూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘అబ్బాయిలు మాత్రమే నడిపే బైక్‌లను అమ్మాయి నడపడం చూస్తే.. ఈ విడ్డూరం ఏంటమ్మా! అని నోరెళ్ల బెడతారు. అటువంటి పరిస్థితుల నుంచి ‘రైడర్‌గర్ల్‌ విశాఖ’గా ఎదిగాను అని తెలిపారు. తన జీవితంలో లడఖ్ ప్రయాణం మరిచిపోలేనిదని తెలిపారు. దేశంలోని అనేక వాతావరణ పరిస్థితుల్లో తాను ప్రయాణించానని తెలిపారు. ప్రయాణంలో కొన్ని చోట్ల వసతికూడా దొరికేది కాదని తాను రోడ్డుపక్కన టెంట్ వేసుకొని రెస్ట్ తోసుకునేదాన్నని తెలిపారు.

రాత్రి సమయంలో ప్రయాణం సాహసంతో కూడుకున్నదని, కొన్ని ప్రదేశాలు చాలా డేంజర్ గా ఉంటాయని.. అటువంటి ప్రదేశాలలో రాత్రి రైడింగ్ చేయడం సేఫ్ కాదని తెలిపారు. అందుకే రైడింగ్‌ చేసే సమయంలో కండీషన్‌లో ఉన్న రైడింగ్‌ గేర్, కొద్దిపాటి ఎమర్జన్సీ మనీ, నా బ్లడ్‌ గ్రూపును బైక్‌ మీద రాయడం, ఎమర్జెన్సీ కాంటాక్ట్‌ నంబరును మొబైల్‌ స్క్రీన్‌ మీద ఉంచుకోవడం, ట్రాకింగ్‌ యాక్సిడెంట్‌ డివైజ్‌ను నాతో ఉంచుకుంటూ.. నాలుగేళ్లుగా మోటోవ్లాగర్‌గా కొనసాగుతున్నాను’’ అని చెప్పింది. అమ్మాయిలు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చని ఆమె మాటలను వింటే అర్ధం అవుతుంది.