Corona Death : భర్తను కోల్పోయిన మహిళకు వేధింపులు..12వ అంతస్తు నుంచి కొడుకుతోపాటు దూకి ఆత్మహత్య

కరోనా సోకి భర్తను కోల్పోయిన మహిళకు ధైర్యం చెప్పాల్సింది పోయి ఇరుగు పొరుగువారు వేధింపులకు గురిచేశారు. సూటీ పోటీ మాటలతో మానసికంగా హింసించారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె తన ఏడు సంవత్సరాల కొడుకుతో తను నివసించే అపార్ట్ మెంట్ 12వ అంతస్థు నుంచి దూకేసింది. ఈ ఘటనలో తల్లీ, పసివాడు ప్రాణాలు కోల్పోయారు.

Corona Death : భర్తను కోల్పోయిన మహిళకు వేధింపులు..12వ అంతస్తు నుంచి కొడుకుతోపాటు దూకి ఆత్మహత్య

Corona Death

Mumbai Woman Jumps From 12th Floor With Son : కరోనా సోకి భర్తను కోల్పోయిన మహిళకు ధైర్యం చెప్పాల్సింది పోయి ఇరుగు పొరుగువారు వేధింపులకు గురిచేశారు. సూటీ పోటీ మాటలతో మానసికంగా హింసించారు.అన్నింటిని భరిస్తూ ఏడు సంవత్సరాల కొడుకుతో ఇంట్లోనే కుమిలిపోతూ బతుకుతోందా అభాగ్యురాలు.కానీ ఇరుగుపొరుగువారు ఆమెను కాకుల్లా పొడుచుకు తిన్నారు. సూలాల్లాంటి మాటలతో వేధించారు.దీంతో వారి మాటలు భరించలేక తన కొడుకుతోపాటు 12వ అంతస్థు నుంచి దూకి ప్రాణాలు కోల్పోయిన ఓ మహిళ అత్యంత దీన గాథ ముంబైలో చోటుచేసుకుంది. అసలే భర్తను కోల్పోయి బాధలో ఉంది. ఏడేళ్ల కుమారుడిని ఒంటరిగా ఎలా పెంచాలా అని భయపడుతున్న ఆమెను పలు రకాలుగా వేధిస్తుంటే డిప్రెషన్‌కు గురైన బాధితురాలు కొడుకుతో కలిసి 12వ అంతస్తు మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన ముంబైలోని చండీవాలిలో నహరే అమృత్ శక్తి నివాస్ అపార్ట్‌మెంట్‌లో జరిగింది.

చండీవాలి అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న రేష్మా ట్రెంచిల్‌ అనే మహిళ భర్త శరత్ కరోనా సోకి చికిత్స పొందుతూ మే 23న మరణించాడు. ఆమె భర్త వ్యవసాయ కోసం ఉపయోగించే పనిముట్లను ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌కు చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా పనిచేసేవాడు. తనను కొడుకుని ఎంతో అపురూపంగా చూసుకునే భర్త తలచుకుని ట్రెంచిల్ కుమిలిపోయింది. ఆ బాధనుంచి తేరుకోలేకపోతోంది. కానీ కొడుకు కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ట్రెంచిల్‌ తన ఏడేళ్ల కుమారుడితో కలిసి ఒంటరిగా బతుకుతోంది. బంధువులు కూడా ఎవ్వరూ రాలేదు.కనీసం పలకరించటానికి కూడా ఎవ్వరూ రాక ఒంటరిగానే కొడుకుతో కలిసి కుమిలిపోతూ బతుకుతోంది. అలా భర్తను కోల్పోయిన బాధ నుంచి ఇంకా తేరుకోనేలేదు. ఆమె నివసించే అపార్ట్ మెంట్ లో ఇరుగుపొరుగు వారు ఆమెతో గొడవకు దిగారు. ట్రెంచిల్‌ ఏడేళ్ల కొడుకు గొడవ చేస్తూ.. తమను ఇబ్బంది పెడుతున్నాడనీ..పైగా మీకు కూడా కరోనా ఉందేమోనని..ఇటువంటివాళ్లు పక్కనుంటే మేం ఎలా బతకాలి? అంటూ ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడారు.

విషాదంలో ఉన్న ట్రెంచిల్‌ వారి మాటలతో మరింతగా కుమిలిపోయింది. కొడుకుకు ఎన్నో రకాలుగా బుజ్జగించి చెప్పింది. అల్లరి చేయవద్దురా..అని కానీ చిన్నపిల్లాడు..తండ్రి పోయాడనే బాధ కూడా తెలియని పసివాడు. వాడి అల్లరి వాడిది.. దీంతో ఇరుగుపొరుగువారి వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో ట్రెంచిల్ డిప్రెషన్‌ లోకి వెళ్లిపోయింది. ఇటువంటి దారుణ పరిస్థితుల్లో నేను నాకొడుకుని ఎలా పెంచగలను? అని పదే పదే కృంగుబాటుకు గురయ్యింది.

ఈ క్రమంలో డిప్రెషన్ ఎక్కువై సోమవారం(జూన్ 21,2021) ఏడేళ్ల కొడుకుని పట్టుకుని తాను ఉంటున్న అపార్టమెంట్‌లోని 12వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పొరుగింట్లో ఉండే వ్యక్తి తనను వేధిస్తున్నారనీ..ప్రతి దానికి తనతో గొడవపడుతున్నాడని..వారి వేధింపులు తట్టుకోలేకే ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నాని సూసైడ్‌ నోట్‌ రాసి పెట్టి ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సూసైడ్‌ నోట్‌ స్వాధీనం చేసుకున్నారు. దానిలో ఉన్న దాని ప్రకారం ట్రెంచిల్‌ పొరుగింటి వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.