Kerala High Court Key Judgment : భ‌ర్త అంగీకారం లేకున్నా ముస్లిం మ‌హిళ‌లు విడాకులు తీసుకోవ‌చ్చు.. కేర‌ళ హైకోర్టు కీల‌క తీర్పు

ముస్లిం మ‌హిళ‌ల విడాకుల‌కు సంబంధించి కేర‌ళ హైకోర్టు కీల‌క తీర్పు వెలువ‌రించింది. భ‌ర్త అంగీకారం లేకున్నా ముస్లిం మ‌హిళ‌లు విడాకులు తీసుకోవ‌చ్చని తెలిపింది. భ‌ర్త నుంచి విడాకులు కావాల‌ని కోరే హ‌క్కును ఇస్లామిక్ చ‌ట్టం గుర్తిస్తుంద‌ని హైకోర్టు వెల్లడించింది.

Kerala High Court Key Judgment : భ‌ర్త అంగీకారం లేకున్నా ముస్లిం మ‌హిళ‌లు విడాకులు తీసుకోవ‌చ్చు.. కేర‌ళ హైకోర్టు కీల‌క తీర్పు

kerala high court

Kerala High Court Key Judgment : ముస్లిం మ‌హిళ‌ల విడాకుల‌కు సంబంధించి కేర‌ళ హైకోర్టు కీల‌క తీర్పు వెలువ‌రించింది. భ‌ర్త అంగీకారం లేకున్నా ముస్లిం మ‌హిళ‌లు విడాకులు తీసుకోవ‌చ్చని తెలిపింది. భ‌ర్త నుంచి విడాకులు కావాల‌ని కోరే హ‌క్కును ఇస్లామిక్ చ‌ట్టం గుర్తిస్తుంద‌ని హైకోర్టు వెల్లడించింది. భ‌ర్త అంగీకారం లేకున్నా ఆ మ‌హిళ విడాకుల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చని కోర్టు వెల్ల‌డించింది.

ఆ మ‌హిళ‌ల‌కు భ‌ర‌ణం ఇవ్వాల‌ని కూడా కోర్టు పేర్కొంది. జ‌స్టిస్ మ‌హ‌మ్మ‌ద్ ముస్తాక్‌, జ‌స్టిస్ సీఎస్ డ‌యాస్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఓ కేసులో ఈ తీర్పు ఇచ్చింది. భ‌ర్త అంగీక‌రించ‌కున్నా కులా విధానాన్ని అమ‌లు చేయ‌వ‌చ్చని కోర్టు ఈ తీర్పులో పేర్కొంది. ఓ కేసులో 59 పేజీల తీర్పును ధ‌ర్మాస‌నం వినిపించింది.

Supreme Court Comments On Talaq : తలాక్‌ విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..‘తలాక్-ఇ-హసన్ సరైనదే’

ముస్లిం మ‌హిళ ఎప్పుడైనా త‌న వివాహ బంధాన్ని బ్రేక్ చేయ‌వ‌చ్చని, ప‌విత్ర ఖురాన్ కూడా ఈ విధానాన్ని అంగీక‌రిస్తుంద‌ని చెప్పింది. భ‌ర్త అంగీకారం ఉన్నా, లేకున్నా విడాకులు తీసుకోవ‌చ్చని కోర్టు తెలిపింది.