Karnataka : నా భార్య ఎప్పుడు నిద్రపోతునే ఉంటుంది.. ప్రశ్నిస్తే పుట్టింటివారితో కొట్టిస్తోందంటూ పోలీసులకు భర్త ఫిర్యాదు

నా భార్య ఎప్పుడు నిద్రపోతునే ఉంటుంది? ఇంట్లో ఏపనీ చేయదు, కనీసం వంట కూడా చేయదు అదేమని ప్రశ్నిస్తే తన పుట్టింటివారితో కొట్టిస్తోంది ఇటువంటి పెళ్లాంతో వేగలేకపోతున్నాను సార్ అంటూ ఓ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Karnataka : నా భార్య ఎప్పుడు నిద్రపోతునే ఉంటుంది.. ప్రశ్నిస్తే పుట్టింటివారితో కొట్టిస్తోందంటూ పోలీసులకు భర్త ఫిర్యాదు

Karnataka Man Police Complaint wife sleeps

karnataka : నా భార్య ఎప్పుడు నిద్రపోతునే ఉంటుంది? ఇంట్లో ఏపనీ చేయదు, కనీసం వంట కూడా చేయదు అదేమని ప్రశ్నిస్తే తన పుట్టింటివారితో కొట్టిస్తోంది ఇటువంటి పెళ్లాంతో వేగలేకపోతున్నాను సార్ అంటూ ఓ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు విన్న పోలీసులు షాక్ అయ్యారు. కర్ణాటకలోని బెంగళూరు ప్రాంతానికి చెందిన బసవనగుడి గ్రామానికి చెందిన కమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి తన భార్యపై వింత ఫిర్యాదు చేశాడు.

Crazy complaint : రోజంతా మేత మేస్తున్నా..మా ఆవులు పాలు ఇవ్వట్లేదు సార్..పోలీసులకు రైతు ఫిర్యాదు

తన భార్య పేరు అయేషా పర్వీన్‌. ఆమె ఎప్పుడు నిద్రపోతూనే ఉంటుంది. ఇంట్లో ఏపనీ చేయదు. కనీసం వంట కూడా చేయదు. నా వివాహం జరిగి ఐదేళ్లు అయ్యింది. ఈ ఐదేళ్లనుంచి ఇదే తంతు.ఇంట్లో ఏపనీ చేయదు. అన్ని పనులు మా అమ్మే చేస్తుంది. అయేషా పర్వీన్ రాత్రి భోజనం చేసి నిద్రపోతే మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు నిద్రలేస్తుంది. అంతే మళ్లీ కాసేపటికే భోజనం చేసిన సాయంత్రం 5.30 పడుకుంటుంది. మళ్లీ రాత్రి 9.30, 10.00గంటలకు నిద్రలేస్తుంది. రాత్రి భోజనం చేసి మళ్లీ పడుకుంటుంది. ఇంటిపని వంటపనీ అంతా మా అమ్మే చూసుకుంటుంది. నా భార్య మాత్రం నిద్రపోవటం..లేచి తినటం మళ్లీ నిద్రపోవటం ఇది తప్ప ఐదేళ్లనుంచి ఏ పనిచేసింది లేదు అంటూ వాపోయారు.

viral news : మా కోడిపెట్టలు గుడ్లు పెట్టట్లేదు సార్..పోలీసులకు వింత ఫిర్యాదు..!!

ఇలా అయితే ఎలా అని నా భార్యను ప్రశ్నిస్తే నాతో గొడవ పెట్టుకుంటుంది. రాద్దాంతం చేస్తుంది. తన పుట్టింటివారితో చెప్పి వారికి ఇక్కడకి రప్పించి గొడవపెడుతుంది. అలా ఓసారి ఆమె పుట్టింటివారు నాపై దాడి చేశారు. ఇష్టానుసారంగా కొట్టారని పోలీసులతో చెప్పుకుని వాపోయాడు కమ్రాన్ ఖాన్..అతని సమస్య విన్న పోలీసులకు ఏం చెప్పాలతో తెలియలేదు. ఇది కుటుంబ సమస్య అని అందరూ కూర్చుని మాట్లాడుకోండి అని సూచించారు. కానీ కమ్రాన్ మాత్రం నేను నా భార్యతో వేగలేకపోతున్నాను సార్..మీరే ఏదోకటి చేయండి అంటూ విన్నవించుకున్నారు.

తండ్రి కొడుతున్నాడ‌ని పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలుడు

భార్య ప్రవర్తనతో నరకయాతన అనుభవిస్తున్నానని..భార్య ఆమె కుటుంబసభ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పెళ్లి చేసుకున్నప్పటినుంచి ఆమె నన్ను చిత్రహింసలు పెడుతోందని చెప్పాడు. ఆమెకు ఏదో వ్యాధి ఉందని..అది దాచి పెట్టి నన్ను మోసం చేశారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. ఆమెకు కనీసం బుద్ధి చెప్పకుండా వారి పుట్టింటివారు నాపై దాడి చేశారని..మా మామ అరీఫుల్లా, అత్త హీనా కౌసర్‌, బావమరిది మహమ్మద్‌ మొయిన్‌లపై చర్యలు తీసుకోవాలని కోరాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కమ్రాన్ కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ చేస్తామని బసవనగుడి పోలీసులు తెలిపారు.

Narottam Mishra : అమ్మను అరెస్ట్ చెయ్యాలన్న మూడేళ్ల చిన్నారికి హోంమంత్రి దీపావళి గిఫ్ట్

Viral Video:‘నా పెన్సిల్ దొంగిలించాడు..ఈడి మీద కేసు పెట్టండి సార్..’ పోలీసులకు బుడ్డోడు ఫిర్యాదు..