Aryan Drugs Case : సామ్ డిసౌజా, ఎన్‌సీబీ అధికారి సింగ్ ఆడియో టేప్ విడుదల చేసిన మంత్రి నవాబ్

శాన్‌విల్లే అడ్రియన్ డిసౌజా అకా సామ్ డిసౌజా, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారి మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణను నవాబ్ మాలిక్ విడుదల చేశారు.

Aryan Drugs Case : సామ్ డిసౌజా, ఎన్‌సీబీ అధికారి సింగ్ ఆడియో టేప్ విడుదల చేసిన మంత్రి నవాబ్

Aryan Drugs Case

Aryan Drugs Case : శాన్‌విల్లే అడ్రియన్ డిసౌజా అకా సామ్ డిసౌజా, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారి మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణను మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు. కాగా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్‌కు దారి తీసిన ముంబై క్రూయిజ్ డ్రగ్స్ బస్ట్ కేసులో సామ్ డిసౌజా పేరు బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

ఎన్సీబీ అధికారి వీవీ సింగ్ కి ఫోన్ చేసిన సామ్ డిసౌజా తాను శాన్‌విల్లే అని పరిచయం చేసుకున్న విధానం మనం ఈ ఆడియోలో వినొచ్చు. బాంద్రాలో నివసించినట్లు ఎన్సీబీ అధికారికి తెలిపారు శాన్‌విల్లే, తనకు అందించిన నోటీసుకు ప్రతిస్పందనగా తాను కాల్ చేస్తున్నానని చెప్పడం వినవచ్చు. ఇక నోటీసులపై స్పందించిన NCB అధికారి హాజరు కావాలని కోరినప్పడు, సామ్ డిసౌజా ఆ సమయంలో తాను ముంబైలో లేనని బయటకు వచ్చినందున మరింత సమయం కావాలని కోరాడు.

చదవండి : Aryan Khan Case : సమీర్ వాంఖడేకు షాక్..ఆర్యన్ ఖాన్ కేసు నుంచి తొలగింపు

ఇక ఇదే సమయంలో విచారణకు వచ్చే సమయంలో తాను ఇంతకాలం వాడిన ఫోన్ తీసుకురావాలని కోరాడు.. ఇదే సమయంలో ఫోన్ మార్చకూడదని హెచ్చరించాడు. ఆదివారం ఈ ఆడియో సంభాషణను ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ ట్వీట్ చేశారు. సామ్ డిసౌజాకు అందజేసిన నోటీసును మహారాష్ట్ర మంత్రి నవాబ్ పోస్ట్ చేశారు.

శామ్ డిసౌజా ఎవరు?

ఆర్యన్ ఖాన్‌ను క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అరెస్టు చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) దర్యాప్తు సందర్భంగా సామ్ డిసౌజా పేరు తెరపైకి వచ్చింది. బాంబే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేస్తూ, ఈ కేసులో ఆర్యన్ ఖాన్‌కు సహాయం చేయడానికి ‘బ్రోకర్’ చేసిన వ్యాపార సలహాదారు సామ్ డిసౌజా. ఈ కేసులో సాక్షులు కిరణ్ గోసావి, ప్రభాకర్ సైల్ డబ్బు తీసుకున్నారని ఆరోపించారు డిసౌజా.

చదవండి : Aryan Khan: బెయిల్‌పై విడుదలైన ఆర్యన్.. హ్యాపీగా షారుఖ్ ఖాన్

షారుక్ ఖాన్ మేనేజర్ పూజా నుంచి వీరిద్దరూ రూ.50 లక్షలు తీసుకున్నట్లుగా తెలిపారు. ఆర్యన్ అరెస్టైన మరుసటి రోజు పూజ దద్లానీ, గోసావి మధ్య సమావేశం ఏర్పాటు చేశానని వారు ఏకాంతంగా మాట్లాడుకున్నారని.. ఇదే సమయంలో గోసావికి పూజా రూ.50 లక్షలు ఇచ్చినట్లు ఆరోపణలు చేశారు.