Lockdown Permission: ఈ-పాస్ ఇప్పిస్తే ఆ పనికి వెళ్లొస్తానంటూ పోలీసులకు రిక్వెస్ట్
దేశవ్యాప్తంగా అమలవుతోన్న కొవిడ్-19 లాక్ డౌన్ పై నిబంధనలు విధించిన సంగతి తెలిసిందే. తప్పని పరిస్థితుల్లో అత్యవసరమైతేనే బయటకు..

Lockdown Request
Lockdown Permission: దేశవ్యాప్తంగా అమలవుతోన్న కొవిడ్-19 లాక్ డౌన్ పై నిబంధనలు విధించిన సంగతి తెలిసిందే. తప్పని పరిస్థితుల్లో అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలంటూ పోలీసులు సూచించారు. అలా వెళ్లాల్సి వస్తే ఆన్ లైన్లో రిక్వెస్ట్ చేసుకుంటే ఈ పాస్ ఇస్తామని కూడా చెప్పారు. ఈ క్రమంలో వచ్చిన వింత రిక్వెస్ట్ కు పోలీసులు షాక్ అయ్యారు.
కన్నూరుకు చెందిన కన్నాపురంలో ఉండే వ్యక్తి సెక్స్ చేయడానికి వెళ్లాలని ఈ పాస్ అప్లికేషన్ పెట్టుకున్నాడు. అసాధారణమైన కారణాన్ని చూసిన సిబ్బంది అసిస్టెంట్ కమిషనర్ పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. అప్లై చేసిన వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించారు. ఆ వ్యక్తి తప్పుగా రాశానని వివరణ ఇచ్చాడు.
six o’clock’ అని రాయడానికి బదులు Sex అని పడిందని సర్ది చెప్పుకున్నాడు. తప్పు చూసుకోకుండా అప్లికేషన్ సబ్ మిట్ చేసేశానని చెప్పాడు. పొరబాటుగా జరిగిందని తెలుసుకున్న పోలీసులు క్షమాపణ పత్రం తీసుకుని విడుదల చేశారు.
గత వారం పింపుల్ ట్రీట్మెంట్ కోసం వెళ్లాలంటూ పెట్టుకున్న ఓ ఈ పాస్ అప్లికేషన్ వైరల్ అయింది.