Neelakurinji Flowers: పన్నెండేళ్లకు విరబూసిన నీలకురింజి పూలు.. అరుదైన దృశ్యాల్ని చూసి పులకిస్తున్న సందర్శకులు.. ఫొటోలు వైరల్

మన దేశంలోని అరుదైన పూలల్లో ఒకటైన ‘నీలకురింజి’ పూలు తాజాగా విరబూశాయి. ఈ పూలు 12 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే పూస్తాయి. తాజాగా కర్ణాటకలోని నీలగిరి పర్వతాల్లో ఇవి విరబూశాయి. సందర్శకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.

Neelakurinji Flowers: పన్నెండేళ్లకు విరబూసిన నీలకురింజి పూలు.. అరుదైన దృశ్యాల్ని చూసి పులకిస్తున్న సందర్శకులు.. ఫొటోలు వైరల్

Neelakurinji Flowers: కొన్ని రకాల పూలు చాలా అరుదుగా పూస్తుంటాయి. నీలకురింజి పూలు అలాంటివే. పన్నెండేళ్లకు ఒక్కసారి మాత్రమే పూస్తాయి. మన దేశంలోని కర్ణాటకతోపాటు తమిళనాడు, కేరళలోని పర్వత ప్రాంతాల్లో మాత్రమే ఈ పూలు ఎక్కువగా పూస్తుంటాయి.

Karnataka: రుణాలు చెల్లించకుంటే రైతుల ఆస్తులు జప్తు చేయడం కుదరదు.. కొత్త చట్టం తేనున్న కర్ణాటక

తాజాగా కర్ణాటకలోని నీలగిరి పర్వతాల్లో ఈ పూలు విరబూశాయి. నీలగిరి పర్వతాల్లో పూస్తాయి కాబట్టి, వీటిని ‘నీలకురింజి’ పూలు అంటారు. కొందరు వీటిని కురింజి పూలు అని కూడా అంటారు. నీలం, ఊదా రంగు కలగలిపినట్లుగా ఉంటాయి ఈ పూలు. లేత పూలు/మొగ్గలు గులాబి రంగులో ఉంటాయి. ఒక్క చోట పూలు పూస్తే.. తిరిగి అక్కడ వికసించడానికి మళ్లీ పన్నెండేళ్లు పడుతుంది. కొన్నిసార్లు 16 సంవత్సరాల టైమ్ కూడా పట్టొచ్చు. ఈ పూలు సముద్ర మట్టానికి 1,300-2,400 మీటర్ల ఎత్తులో ఉన్న పర్వత ప్రాంతాల్లో మాత్రమే పూస్తుంటాయి. గతేడాది కొడగు జిల్లాలో ఈ పూలు పూశాయి. ఇప్పుడు చిక్ మంగళూరు ప్రాంతంలోని నీలగిరి పర్వాతాల్లో నీలకురింజి పూలు విరబూసి ఆకట్టుకుంటున్నాయి. పన్నెండేళ్ల తర్వాత ఈ ప్రాంతంలో పూలు పూయడంతో స్థానికులు, పర్యాటకులు వీటిని చూసి పులకించిపోతున్నారు.

Ankita Bhandari: పేదదాన్నే.. కానీ పది వేలకు నన్ను నేను అమ్ముకోలేను.. స్నేహితురాలికి మెసేజ్ చేసిన అంకిత

వీటిని చూసేందుకు భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. అక్కడ ఫొటోలు, వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫొటోలు ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. అయితే, ఇక్కడికి పర్యాటకుల్ని అనుమతించడంపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ మంది పర్యాటకులు వస్తే, ఇక్కడి మొక్కలకు హాని జరిగే అవకాశం ఉందని, కాబట్టి ఈ విషయంలో కొన్ని ఆంక్షలు విధించాలని వాళ్లు సూచిస్తున్నారు.