నెవర్‌ గివప్.. ఎలన్‌ మస్క్‌పై Anand Mahindra ప్రశంసల వర్షం, నెటిజన్లకు లైఫ్ లెసన్

బిజినెస్‌ టైకూన్‌ ఆనంద్‌ మహీంద్రా మరోసారి టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ పై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు నెటిజన్లకు లైఫ్‌ లెసెన్స్‌ నేర్పించే ప్రయత్నం చేశారు. మూడేళ్లల్లో ఎలన్‌

నెవర్‌ గివప్.. ఎలన్‌ మస్క్‌పై Anand Mahindra ప్రశంసల వర్షం, నెటిజన్లకు లైఫ్ లెసన్

Anand Mahindra

Anand Mahindra : ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా మరోసారి టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ పై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు నెటిజన్లకు లైఫ్‌ లెసెన్స్‌ నేర్పించే ప్రయత్నం చేశారు. మూడేళ్లల్లో ఎలన్‌ సాధించిన ఘనతను నెటిజన్లకు గుర్తు చేశారు. ‘నెవర్‌ గివ్‌ అప్‌.. బిలివ్‌ ఇన్‌ యువర్‌ ఓన్‌ స్టోరీ ‘అంటూ హితబోధ చేశారు.

Heart Attack : అకస్మాత్తుగా గుండెపోటు ఎందుకు వస్తుందంటే?..

ఎలన్‌ మస్క్‌ ఇటీవల అమెరికాలో రెంటల్‌ కార్‌ సర్వీసులు అందించే హెర్జ్‌ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. ఆ డీల్‌ దెబ్బకు టెస్లా కార్ల షేర్ల విలువ అమాంతం పెరిగింది. దీంతో టెస్లా కంపెనీ షేర్లు ఒక్క రోజులోనే 36 బిలియన్‌ డాలర్లను పొందడంతో ఎలన్‌ మస్క్‌ సంపద 300 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఎలన్‌ సాధించిన ఈ అరుదైన ఫీట్‌ పై ప్రపంచ దేశాలకు చెందిన వ్యాపార దిగ్గజాలు ప్రశంసల వర్షం కురిపించారు. దేశీ ఆటోమొబైల్‌ దిగ్గజం మహీంద్రా అధినేత ఆనంద్‌ మహీంద్రా ఒక అడుగు ముందుకేశారు.

Smokers Food : సిగరెట్ తాగే వారు ఈ ఆహారం తింటే ఊపిరితిత్తులు సేఫ్…

2018 న్యూయార్క్‌ టైమ్స్‌తో జరిగిన ఇంటర్వ్యూలో మస్క్‌ భావోద్వేగంగా మాట్లాడారు. తన వ్యక్తిగత జీవితంలో గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయని, ఈ సంవత్సరంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు జీవితంలో మరోసారి ఎదురు కాకూడదని దేవుడిని కోరుకుంటున్నానని చెప్పాడు. ఆ ఇంటర్వ్యూని ఆనంద్‌ మహీంద్రా తాజాగా రీట్వీట్‌ చేశారు. నాటి ఎలన్‌ మస్క్‌ పరిస్థితుల్ని గుర్తు చేసిన ఆనంద్‌ మహీంద్రా.. కేవలం మూడేళ్లలో అనుకున్నది సాధించారు. ప్రపంచంలోనే ఇతర వ్యాపార వేత్తల కంటే గొప్పగా ఆయన ఆస్తిపాస్తులు, సంపాదన గడించారని కొనియాడారు. అందుకే ‘నెవర్‌ గివ్‌ అప్‌.. బిలివ్‌ ఇన్‌ యువర్‌ ఓన్‌ స్టోరీ ‘ అంటూ ట్వీట్‌ లో తెలిపారు.

CIBIL Score : మీకు సిబిల్ స్కోరు లేదా? అయినా రుణం తీసుకోవచ్చా? ఎలానంటే?