Corona In India : రానున్న 100-125 రోజులు అత్యంత కీలకం : వీకే పాల్

కరోనా కేసుల తగ్గుదల రేటు తగ్గాయి.కానీ ఇది హెచ్చరికే అంటున్నారు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్. కరోనాపై పోరాటంలో రాబోయే 100 నుంచి 125 రోజులు అత్యంత కీలకమని తెలిపారు.

Corona In India : రానున్న 100-125 రోజులు అత్యంత కీలకం :  వీకే పాల్

Corona In India

Next 100 to 125 cases are very important : కరోనా కేసుల తగ్గుదల రేటు తగ్గాయి.కానీ ఇది హెచ్చరికే అంటున్నారు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్. కరోనాపై పోరాటంలో రాబోయే 100 నుంచి 125 రోజులు అత్యంత కీలకమని..సెకండ్ వేవ్ లో ఉద్ధృతంగా నమోదైన కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టినా..కేసుల తగ్గుదల శాతం గత కొన్ని రోజులుగా తగ్గిందని తెలిపారు. రాబోయే 100-125 రోజులు అత్యంత కీలకమని..వ్యాక్సినేషన్ల వేగంగా ఇంకా పెంచాల్సి అవసరం ఉందని తెలిపారు. జులై చివరి నాటికి 50 కోట్ల వ్యాక్సిన్ డోసులను వేయాలనే టార్గెట్ ను పెట్టుకున్నామన్నారు. 66 కోట్ల డోసులకు కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిందని..దీనికి అదనంగా ప్రైవేట్ సెక్టార్ కు కూడా 22 కోట్ల డోసులు వెళతాయని చెప్పారు. మూడో వేవ్ ను అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకోవాలని టాస్క్ ఫోర్స్ ను ప్రధాని మోదీ ఆదేశించారని తెలిపారు.

థర్డ్ వేవ్ లో ప్రాణనష్టం జరకుండా ఉండాలంటే జులై చివరినాటికల్లా వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని అప్పుడే థర్డ్ వేవ్ ను కట్టడి చేయగలం అని తెలిపారు. టీకాలు వేయటం వేగవంతం చేయటమే కరోనా కట్టడికి ఉన్న ఏకైక మార్గమని అందుకే ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న పోలీసు సిబ్బంది కోవిడ్ వల్ల మరణించే ప్రమాదాన్ని నివారించారని చెప్పారు. తమిళనాడులో ఫ్రంట్‌లైన్ కార్మికుల్లో ఉన్న పోలీసు సిబ్బందిపై జరిగిన అధ్యయనంలో ఇది వెల్లడి అయ్యిందని తెలిపారు.

“డెల్టా వేరియంట్-ఆధారిత సెకండ్ వేవ్లో కరోనావైరస్ కారణంగా 95 శాతం మరణాలను నివారించడంలో అధిక సంఖ్యలో ఉన్న పోలీసు సిబ్బందికి రెండు డోసుల COVID-19 వ్యాక్సిన్ విజయవంతమైందని అధ్యయనం తెలిపిందని అన్నారు.1,000 మందికి COVID-19 మరణాలు సంభవించని వారిలో 1.17, పాక్షికంగా టీకాలు వేసిన వారిలో 0.21 మరియు పూర్తిగా టీకాలు వేసిన వారిలో 0.06 మంది ఉన్నారని అధ్యయనంలో తేలింది.