Rewards On Maoist Leaders : మావోయిస్టు కీలక నేతలపై రివార్డులు ప్రకటన

ఎన్ వోబీలో ఎన్ ఐఏ దర్యాప్తు వేగవంతం చేసింది. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులపై ఫోకస్ పెట్టింది. మావోయిస్టు కీలక నేతలపై అధికారులు రివార్డులను ప్రకటించారు. గాజర్ల రవిపై రూ.10 లక్షల రివార్డును ప్రకటించారు.

Rewards On Maoist Leaders : మావోయిస్టు కీలక నేతలపై రివార్డులు ప్రకటన

MAOIST

Rewards On Maoist Leaders : ఎన్ వోబీలో ఎన్ ఐఏ దర్యాప్తు వేగవంతం చేసింది. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులపై ఫోకస్ పెట్టింది. మావోయిస్టు కీలక నేతలపై అధికారులు రివార్డులను ప్రకటించారు. గాజర్ల రవిపై రూ.10 లక్షల రివార్డును ప్రకటించారు. ఏపీకి చెందిన జలుమూరి శ్రీనుబాబు, మెట్టు జాగారావుపై రూ.5 లక్షల చొప్పున రివార్డును ప్రకటించారు. ఏవోబీలోని సుంకి, నారాయణపట్నం, కోరాపూర్ లలో రివార్డు పోస్టర్లను అంటించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఫోకస్ అంతా ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం మీదే ఉంది. ఎందుకంటే.. మావోయిస్ట్ కీలక నేతలంతా ఉండేది అక్కడే. అందువల్ల.. వాళ్లను ఎన్‌కౌంటర్ చేస్తే.. పార్టీ కేడర్ అంతా కంట్రోల్ అవుతుందనే ఆలోచనతో కేంద్రం ఉంది.

ఇటీవలే ఛత్తీస్‌గఢ్ అడవుల్లో జరిపిన ఎన్‌కౌంటర్ లక్ష్యం కూడా ఇదే. ఈ దాడిలో.. మావోయిస్ట్ కీలక నేత హిడ్మాను టార్గెట్‌ చేసి పోలీసు బలగాలు దాడి చేసినట్లు తెలుస్తోంది.  తెలంగాణ గ్రేహౌండ్స్, ఛత్తీస్‌గఢ్ సీఆర్పీఎఫ్‌కు చెందిన కోబ్రా టీం జరిపిన జాయింట్ ఆపరేషన్‌లో.. హిడ్మా ఎన్‌కౌంటర్ అయినట్లు వార్తలొచ్చాయి. కానీ.. పోలీసులు మాత్రం ధ్రువీకరించలేదు. ఛత్తీస్‌ఘడ్‌లోని సుక్మా జిల్లా ఎల్మాగూడ – బీజాపూర్ జిల్లా ఎగువసెంబి మధ్య ప్రాంతంలో.. ఎటాక్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడికి పోలీసులు హెలికాప్టర్ కూడా వాడారని స్థానికులు చెబుతున్నారు. హిడ్మా సేఫ్‌గా ఉన్నాడంటూ మావోయిస్టు పార్టీ ప్రకటించింది.

Encounter Maoist Killed : ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్.. మావోయిస్టు మృతి

పోలీసులు మాత్రం ఈ దాడికి హెలికాప్టర్లు, డ్రోన్లు వాడారంటూ ఆరోపిస్తోంది. దీంతో నిజంగానే హిడ్మా ఎస్కేప్‌ అయ్యాడా అన్న దానిపైనా సస్పెన్స్ కొనసాగుతోంది. రూ.50 లక్షల రివార్డు ఉన్న మావోయిస్ట్ కీలక నేత హిడ్మాను.. నాలుగు రాష్ట్రాల పోలీసులు.. 20 ఏళ్లుగా వెతుకుతున్నారు. ఇప్పుడున్న మావోయిస్ట్ అగ్ర నేతల్లో ఎక్కువగా యాక్టివ్‌గా ఉన్నది కూడా అతడే. భద్రతా బలగాలను దెబ్బతీయడంలో హిడ్మాది అందెవేసిన చేయి. అతడు స్కెచ్ వేసి చేసిన దాడుల్లోనే ఎక్కువమంది పోలీసులు ప్రాణాలు వదిలారు. అందుకే.. భద్రతా బలగాలుఅతడి పైనే ముందుగా గురి పెట్టాయి.