రాష్ట్రపతి క్షమాభిక్షను చాలెంజ్ చేస్తూ కోర్టుకెక్కిన నిర్బయ దోషి

రాష్ట్రపతి క్షమాభిక్షను చాలెంజ్ చేస్తూ కోర్టుకెక్కిన నిర్బయ దోషి

ఢిల్లీ 2012గ్యాంగ్ రేప్ కేసు ముగుస్తుందనుకుంటే మరో ట్విస్ట్ బయటికొచ్చింది. రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరించడంతో ఉరి తేదీ ఖరారు అయింది. ఇదిలా ఉంటే ముగ్గురు దోషులు మళ్లీ పిటిషన్లు దాఖలు చేశారు. గతంలో వినయ్, ముకేశ్ సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేసుకోగా అది తిరస్కరణకు గురైంది. ముకేశ్ రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ దరఖాస్తు చేసుకోగా అది తిరస్కరణకు గురైంది.

ఫిబ్రవరి 1న ఉదయం ఆరు గంటలకు నిర్భయ కేసు దోషులు నలుగురిని ఉరితీయాల్సిందిగా ఢిల్లీ కోర్టు ఇటీవల డెత్ వారెంట్ జారీ చేసింది. ఇప్పుడు మరోసారి ముఖేశ్ సింగ్ అనే దోషి రాష్ట్రపతి తిరస్కరించిన క్షమాభిక్షను ఛాలెంజ్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. 

‘2012 నుంచి 2015వరకూ, 2019 నుంచి 2020వరకూ మధ్య కాలంలో రికార్డులు, ఖైదీగా ఉన్నప్పటి సంపాదన, ఈ గ్యాప్‌లో చదువుకున్న వివరాలు, తీహార్ ఒలింపిక్స్, పెయింటింగ్ వంటి వివరాలు ఏమీ బయటపెట్టడం లేదు’ జైలు అధికారులు అవి ఇస్తే క్షమాభిక్ష పెట్టుకునేందుకు వీలు ఉంటుందని దోషుల తరపున్యాయవాది వాదన వినిపిస్తున్నారు. 

ఉరిశిక్షను అమలును వాయిదా వేసేందుకు దోషుల తరపు న్యాయవాదులు పలు రకాల ట్రిక్స్ వాడుతున్నారు. క్షమాభిక్ష కోరుతూ పలుమార్లు అడుగుతుండటంతో నలుగురిని ఒకేసారి ఉరితీయాలని ఏ ఒక్కరిపై విచారణ జరుగుతున్నా.. మిగిలిన వారి ఉరి కూడా వాయిదాపడుతూ వస్తుంది. తీహార్ జైలు అధికారులు ఉరికి ముందు ఆత్మహత్య లాంటి చర్యలకు పాల్పడకుండా వారిపై ఫోకస్ పెట్టినట్లు, విడివిడిగా సెల్‌లలో ఉంచినట్లు తెలిపారు.