Nitin Gadkari Ola EV: ఓలా విద్యుత్ వాహనాన్ని తనిఖీ చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

ఓలా కంపెనీ తయారు చేస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లను భవిష్ అగర్వాల్ సమక్షంలోనే నితిన్ గడ్కరీ స్వయంగా తనిఖీ చేశారు.

Nitin Gadkari Ola EV: ఓలా విద్యుత్ వాహనాన్ని తనిఖీ చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

Ola

Nitin Gadkari Ola EV: వేసవిలో విపరీతమైన వేడి కారణంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు మంటలు అంటుకున్న అనేక సంఘటనలు ఇటీవల చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పూణే నగరంలో ఓలా సంస్థకు చెందిన విద్యుత్ ద్విచక్ర వాహనాలు అగ్నిప్రమాదాలకు గురికావడం ఆయా వాహనాల నాణ్యతపై తీవ్ర ఆందోళన వ్యక్తం అయింది. ఓలా, ఒకినావా, ప్యూర్ ఈవీ, జితేంద్ర ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇంకా అనేక ఇతర ఇ-స్కూటర్ కంపెనీలు మునుపెన్నడూ లేని విధంగా అగ్నిప్రమాదాలకు గురయ్యాయి. ఈనేపధ్యంలో ఓలా సంస్థ సీఈఓ భవిష్ అగర్వాల్ గురువారం కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈసందర్భంగా ఓలా కంపెనీ తయారు చేస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లను భవిష్ అగర్వాల్ సమక్షంలోనే నితిన్ గడ్కరీ స్వయంగా తనిఖీ చేశారు.

Also Read:FIH Odisha Hockey : హాకీ పురుషుల ప్రపంచ కప్ అధికారిక లోగో ఆవిష్కరణ..

రైడ్-హెయిలింగ్ ఆపరేటర్ యొక్క ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగమైన ఓలా ఇ-స్కూటర్లు అగ్నిప్రమాదానికి గురవడంపై కేంద్రం గత నెలలో దర్యాప్తుకు ఆదేశించింది. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేయాలని, నివారణ చర్యలను సూచించాలని సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్‌ప్లోజివ్ అండ్ ఎన్విరాన్మెంట్ సేఫ్టీ (సీఎఫ్ఈఈఎస్)ను కోరినట్లు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇటువంటి సంఘటనలను నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలపై తన సూచనలతో పాటు కారణాలను పంచుకోవాలని రవాణా మంత్రిత్వ శాఖ సిఎఫ్ఐఇఎస్ ను కోరింది.

Also read:IPL 2022 – RR vs GT : టాస్ గెలిచి రాజస్థాన్ ఫీల్డింగ్.. గుజరాత్‌కు స్టార్ బౌలర్ దూరం..!

విద్యుత్ ద్విచక్ర వాహనాలు మంటల్లో కాలిపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో వినియోగదారులు విద్యుత్ ద్విచక్ర వాహనాల భద్రత, నాణ్యతాప్రమాణాలపై సందేహం వ్యక్తం చేశారు. విద్యుత్ ద్విచక్ర వాహనాలో వాడే లిథియం-అయాన్ బ్యాటరీలలో థర్మల్ రన్అవే కారణంగా వాహనాల్లో మంటలు చెలరేగుతున్నట్లు నిపుణులు గుర్తించారు. థర్మల్ రన్అవే ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలను కలిగించడమే కాకుండా, ఆర్పడం కూడా అంతే కష్టం.

Also Read:Litre Petrol for Re. 1: రూపాయికే లీటర్ పెట్రోల్ పంపిణీ: ఎగబడిన వాహనదారులు