Nivetha Pethuraj : ఫ్రైడ్ రైస్‌లో బొద్దింక.. సినీ నటికి చేదు అనుభవం

సినీ నటి నివేదా పేతురాజ్ కు చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఆర్డర్ చేసిన ఫ్రైడ్ రైస్ లో బొద్దింక ఉంది. దీంతో రెస్టారెంట్ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Nivetha Pethuraj : ఫ్రైడ్ రైస్‌లో బొద్దింక.. సినీ నటికి చేదు అనుభవం

Nivetha Pethuraj

Nivetha Pethuraj : సినీ నటి నివేదా పేతురాజ్ కు చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఆర్డర్ చేసిన ఫ్రైడ్ రైస్ లో బొద్దింక ఉంది. దీంతో రెస్టారెంట్ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్న సాయంత్రం చెన్నైలోని ఓ ప్రముఖ రెస్టారెంట్ నుంచి ఆన్ లైన్ ద్వారా ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసింది నివేదా. డెలివరీ బాయ్ వచ్చి పార్సిల్ ఇచ్చి వెళ్లాడు. ఫుడ్ పార్సిల్ తెరవగానే ఆమె షాక్ తింది. అందులో ఓ చచ్చిన బొద్దింక దర్శనమిచ్చింది. దాంతో నివేదా మండిపడింది. సదరు రెస్టారెంట్ ను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే ఇలాంటి రెస్టారెంట్లకు భారీ జరిమానా వడ్డించాలని డిమాండ్ చేసింది నివేదా. వాళ్లు సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని విమర్శించింది. ఫ్రైడ్ రైస్ లో వచ్చిన బొద్దింక ఫొటోను కూడా నివేదా సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Read