Viral Video: మేమేం తక్కువ కాదు.. యువకులతో పోటీపడి కబడ్డీ ఆడిన వృద్ధులు.. వీడియో వైరల్

గ్రామీణ క్రీడల్లో ప్రధానమైనది కబడ్జీ. గ్రామాల్లో ఇప్పటికీ కబడ్డీ ఆడుతుంటారు. ఎక్కువగా ఈ క్రీడలో యువకులు పాల్గొంటారు. రాజస్థాన్ లో మాత్రం యువకులతో వృద్ధులు పోటీపడ్డారు. ఇందుకు సంబంధించి వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Viral Video: మేమేం తక్కువ కాదు.. యువకులతో పోటీపడి కబడ్డీ ఆడిన వృద్ధులు.. వీడియో వైరల్

Kabaddi Match

Viral Video: గ్రామీణ క్రీడల్లో కబడ్డీ ప్రధానమైన ఆట. గ్రామాల్లో కబడ్డీ పోటీలు నిర్వహిస్తుంటారు. ఈ పోటీల్లో యువకులు పాల్గొని తమ ప్రతిభను కనబరుస్తుండటం మనం చూస్తుంటాం. కానీ వృద్ధులు వర్సెస్ యువకులు కబడ్డీ ఆడితే ఎలా ఉంటుందో మీరు చూశారా.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో 20-25ఏళ్ల మధ్య వయస్సు కలిగిన కుర్రాళ్లతో 60ఏళ్లు దాటిన వృద్ధులు పోటీపడి కబడ్డీ ఆడారు.

Viral Video: బీచ్‌లో బికినీలతో అందగత్తెలు సందడి చేస్తుంటే.. చీరకట్టులో మహిళ ఎంట్రీ.. కళ్లన్నీ అటువైపే
రాజస్థాన్ ప్రభుత్వం రాష్ట్రంలోని 44వేల కంటే ఎక్కువ గ్రామాల్లో నెల రోజులు రాజీవ్ గాంధీ గ్రామీణ ఒలింపిక్ క్రీడలను నిర్వహిస్తుంది. ఈ క్రీడల్లో పాల్గొనేందుకు 30లక్షలకుపైగా గ్రామీణ క్రీడాకారులు నమోదు చేసుకుంటున్నారు. రాజస్థాన్ అంతటా ఆటలు కొనసాగుతుండగా ఓ గ్రామంలో యువకులు వర్సెస్ వృద్ధుల మధ్య జరిగిన కబడ్డీ మ్యాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది.

Viral video: పెరట్లో మంచంపై పడుకున్న మహిళ.. ఆమె మీదికెక్కిన నాగుపాము.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

రాజస్థాన్ ప్రభుత్వ అధికారిక ఖాతా ద్వారా ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియోలో వృద్ధులు యువకులతో పోటీపడి కబడ్డీ ఆడారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు వృద్ధుల ఎనర్జీకి ఫిదా అవుతున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రీ ట్వీట్లు చేస్తున్నారు. ‘అంకుల్ ఈజ్ థా టైగర్” అని ఒక నెటిజన్ రాశాడు. వృద్ధుల ఎనర్జీ చూస్తుంటూ ఆశ్చర్యమేస్తుంది అంటే మరో నెటిజన్ అన్నాడు.