Omicron Threat : ఒమిక్రాన్‌పై జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు లేఖ రాసిన కేంద్రం

దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో  పలు సూచనలు చేస్తూ  కేంద్రం ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన్నిరాష్ట్రాలకు లేఖ రాశారు.

Omicron Threat : ఒమిక్రాన్‌పై జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు లేఖ రాసిన కేంద్రం

ICU beds

Omicron Threat : దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో  పలు సూచనలు చేస్తూ  కేంద్రం ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన్నిరాష్ట్రాలకు లేఖ రాశారు. ఒమిక్రాన్,డెల్టా వేరియంట్ కంటే కనీసం 3 రెట్లు ఎక్కువ వ్యాప్తి సామర్థ్యం కలిగి ఉందని అందులో తెలిపారు.

జిల్లా స్థాయిలో, క్షేత్రస్థాయిలో కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్న సంఖ్యను బట్టి స్ధానిక పరిస్ధితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. దూరదృష్టితో వ్యవహరించి రాష్ట్రాలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలనిచెప్పింది. అవసరమైతే ఒమిక్రాన్ కేసులు ఎక్కువున్న ప్రాంతాల్లో కఠినమైన కంటైన్మెంట్ చర్యలు అమలు చేయాలని చెప్పింది.

Also Read :Husband Attacks Wife : భార్యపై దాడి..మృతి-భర్త ఆత్మహత్య

ఒమిక్రాన్ రకం కరోనా కేసులు యూరప్, అమెరికా, బ్రిటన్, ఆఫ్రికా దేశాల్లో వేగంగా పెరుగుతుండం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది.
ఒమిక్రాన్ కేసుల్లో మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలు మొదటి స్థానంలో కొనసాగుతుంటే..తెలంగాణ సెకండ్ ప్లేస్ లో నిలుస్తోంది. తెలంగాణలో 20 కేసులుంటే..తాజాగా..మరో నలుగురు ఈ వైరస్ బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 24కి చేరింది.

తెలంగాణలో ఒమిక్రాన్ వైరస్ సోకిన వారిని టిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైరస్ బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇక మిగతా వారిలో స్వల్ప లక్షణాలే ఉన్నట్లు అధికారులు తెలిపారు.