ఒకే దేశం ఒకే రేషన్‌ కార్డు : 12 రాష్ట్రాల్లో అమల్లోకి

  • Published By: veegamteam ,Published On : January 2, 2020 / 04:35 AM IST
ఒకే దేశం ఒకే రేషన్‌ కార్డు : 12 రాష్ట్రాల్లో అమల్లోకి

ఒకే దేశం ఒకే రేషన్‌ కార్డు విధానాన్ని 2020 కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి  కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రారంభించామని కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.  

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, గుజరాత్‌, మహారాష్ట్ర, హరియాణా, రాజస్థాన్‌, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్‌, గోవా, జార్ఖండ్‌, త్రిపురల్లో బుధవారం నుంచి ఈ సదుపాయం ప్రారంభమైంది. దీని ప్రకారం ఈ 12 రాష్ట్రాలకు చెందిన ప్రజాపంపిణీ వ్యవస్థ లబ్ధిదారులు ఏ రాష్ట్రంలో ఉన్నా తమ వాటా రేషన్‌ సరుకులు తీసుకోవచ్చు. ఈ సౌకర్యాన్ని  2020 జూన్‌ నాటికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను ‘వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌’ విధానానికి అనుసంధానిస్తారు.

దీంట్లో భాగంగా..రేషన్‌ కార్డులను కొత్త ఫార్మాట్‌లో రూపొందించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ కొత్త కార్డులు జూన్‌ 1 నుంచి అందుబాటులోకి రానున్నాయి. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు జారీచేసే కార్డులన్నీ ఒకే స్టాండర్డ్‌ ఫార్మాట్‌లో ఉంటాయి.