UP Election 2022: యూపీలో అధికారం ఎవరిదీ? 8 సర్వేల్లో ఏం తేలింది?!

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సమీపిస్తుంది. ఈ క్రమంలో రాజకీయం రసవత్తరం మారుతోంది.

UP Election 2022: యూపీలో అధికారం ఎవరిదీ? 8 సర్వేల్లో ఏం తేలింది?!

UP Election 2022 Poll of Polls

UP Election 2022 Poll of Polls: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సమయం వచ్చేస్తోంది. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనుండగా రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఉత్తరప్రదేశ్‌లో అధికార భారతీయ జనతా పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ హోరాహోరీగా నువ్వా? నేనా? అన్న రీతిలో బరిలో తలపడుతున్నాయి.

ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా ఎనిమిది ఏజెన్సీల ద్వారా జరిగిన సర్వే ఇప్పుడు అందుబాటులో ఉంది. అన్నీ సర్వేల్లోనూ బీజేపీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రాగా.. అదే సమయంలో సమాజ్ వాదీ పార్టీ రెండో అతిపెద్ద పార్టీగా అవతరిస్తున్నట్లు చెబుతున్నాయి.

C ఓటర్ ప్రకారం, మొత్తం 403 సీట్లలో బీజేపీ కూటమి 223 నుంచి 235 సీట్లు రావచ్చని, అదే సమయంలో సమాజ్‌వాదీ పార్టీకి 145 నుంచి 157 సీట్లు లభించవచ్చని చెబుతున్నాయి సర్వేలు. బీఎస్పీకి ఎనిమిది నుంచి 16 సీట్లు రాగా, కాంగ్రెస్‌కు మూడు నుంచి ఏడు సీట్లు మాత్రమే రానున్నట్లు చెప్పింది ఈ సర్వే.

Omicron: ఒమిక్రాన్ కొత్త లక్షణాలు.. కంటిలో ఈ మార్పులు కనిపించొచ్చు

డీబీ లైవ్ సర్వేలో మాత్రం సమాజ్ వాదీ పార్టీకి మెజారిటీ వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఎస్పీకి 203 నుంచి 211, బీజేపీకి 144 నుంచి 152, బీఎస్పీకి 12 నుంచి 20, కాంగ్రెస్‌కు 19 నుంచి 27 సీట్లు రావచ్చని సర్వే చెబుతోంది.

సర్వే ఏజెన్సీ BJP SP BSP Congress
C Voter 223-235 145-157 8-16 3-7
ZEE-డిజైన్ బాక్స్‌డ్ 245-267 125-148 5-9 3-7
ఇండియా టీవీ 230-235 160-165 2-5 3-7
రిపబ్లిక్- P MARQ 252-272 111-131 8-16 3-9
Polstrat NewsX 235-245 120-130 13-16 4-5
DB Live 144-152 203-211 12-20 19-27
టైమ్స్ నౌ- VETO 240 143 10 8
ఇండియా న్యూస్ – జన్ కీ బాత్ 226-246 144-160 8-12 0-1
Poll of Polls 224- 236 144-156 8-13 5-9