Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై రాజీనామా ఒత్తిడి.. ‘రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తప్పుకో’ అంటూ డిమాండ్

దేశంలో ఎక్కడ వందేభారత్ రైలు ప్రారంభోత్సవం జరిగినా అక్కడికి వెళ్లి జెండా ఊపే మోదీ, ఒడిశా ప్రమాదంపై ప్రకటన చేసి ఊరుకున్నారని మండిపడుతున్నారు. ప్రజా సంక్షేమం విషయంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోందని విమర్శిస్తున్నారు.

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై రాజీనామా ఒత్తిడి.. ‘రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తప్పుకో’ అంటూ డిమాండ్

Railways Minister Resign: ఒడిశాలో జరిగిన దారుణ రైలు ప్రమాదంపై విపక్షాలు సహా నెటిజెన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటికే 300 మందికి పైగా మరణించారు, 1000 మందికి పైగా గాయపడ్డారు. ఇంత పెద్ద ప్రమాదానికి కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యతని, అందుకు ప్రతిగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోంది. రైల్లేల్లో సంస్కరణలు తీసుకొస్తున్నామని, ఇక ప్రమాదాలే ఉండవంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం, తాజా రైల్వే ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోందంటూ మండిపడుతున్నారు.

Odisha Train Accident: ఒడిశాలో జరిగిన అతిపెద్ద రైల్వే ప్రమాదంపై తప్పక తెలుసుకోవాల్సిన వివరాలు ఇవే..

ఈ విషయమై ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్ మాట్లాడుతూ ‘‘అది చాలా దురదృష్టకరమైన ఘటన. దీనికి కారణాలేంటో గుర్తించి, బాధ్యులైన వారిని శిక్షించడానికి రైల్వే శాఖ తక్షణమే చర్యలు ప్రారంభించాలి. రైల్వేలు ప్రయాణికుల ప్రాణాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. గతంలో ఇలాంటి రైలు ప్రమాదాలపై రైల్వే మంత్రి రాజీనామా చేసేవారు. కానీ ఇప్పుడు దానిపై మాట్లాడేందుకు ప్రభుత్వంలో ఉన్నవారు సిద్ధంగా లేరు’’ అని అన్నారు. పరోక్షంగా రైల్వే మంత్రి అశ్విణీ వైష్ణవ్ రాజీనామా చేయాలనే డిమాండ్ ను అజిత్ పవార్ లేవనెత్తారు. ఇతర విపక్షాల పలువురు నేతలు ఇప్పటికే రాజీనామాను డిమాండ్ చేశారు.

Odisha Train Accident: రైలు ప్రమాదంపై కొత్త ప్రశ్నలు.. కవచ్ ఉండి కూడా ప్రమాదం జరిగిందా? లేదంటే కవచమే లేదా?

ఇక కవచ్ అంశాన్ని లేవనెత్తి నెటిజెన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. రెండేళ్లుగా కవచ్ గురించి చెప్తూ తమ ప్రభుత్వాన్ని ఆకాశానికెత్తిన రైల్వే మంత్రి, నేడు ఏ సమాధానం చెప్తారని ప్రశ్నిస్తున్నారు. తాజా ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని అంటున్నారు.

ఇక ప్రధానమంత్రి నరేంద్రమోదీపై సైతం తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దేశంలో ఎక్కడ వందేభారత్ రైలు ప్రారంభోత్సవం జరిగినా అక్కడికి వెళ్లి జెండా ఊపే మోదీ, ఒడిశా ప్రమాదంపై ప్రకటన చేసి ఊరుకున్నారని మండిపడుతున్నారు. ప్రజా సంక్షేమం విషయంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోందని విమర్శిస్తున్నారు.