Depression: సోషల్ మీడియా ఎక్కువగా వాడుతున్నారా.. అయితే డిప్రెషన్ రావొచ్చంటున్న సైంటిస్టులు

సోషల్ మీడియాను అధికంగా వాడే యువత త్వరగా డిప్రెషన్ బారిన పడతారని తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా 18-30 ఏళ్ల యువత డిప్రెషన్ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Depression: సోషల్ మీడియా ఎక్కువగా వాడుతున్నారా.. అయితే డిప్రెషన్ రావొచ్చంటున్న సైంటిస్టులు

Depression: సోషల్ మీడియాను ఎక్కువగా వాడే యువత డిప్రెషన్ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు సైంటిస్టులు. అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ ఆర్కాన్సస్ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో హిమపాతం.. మంచు పర్వతాల్లో చిక్కుకుని 10 మంది మృతి

తమ పరిశోధనకు సంబంధించిన ఫలితాల్ని వారు ‘జర్నల్ ఆఫ్ అఫెక్టివ్ డిజార్డర్స్ రిపోర్ట్స్’లో ప్రచురించారు. ఈ రిపోర్ట్ ప్రకారం.. సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉండే యువత కొద్దిరోజుల్లోనే డిప్రెషన్ బారిన పడే అవకాశం ఉంది. వారి వ్యక్తిత్వం ఎలాంటిదైనా ఆరు నెలల్లోనే డిప్రెషన్‌కు గురి కావొచ్చు. అయితే, డిప్రెషన్‌కు అనేక కారణాలు కూడా ఉంటాయి. ఒక్కో రకమైన మనస్తత్వం ఉన్న వారిపై సోషల్ మీడియా ఎలాంటి ప్రభావం చూపిస్తుందో శాస్త్రవేత్తలు గుర్తించారు. రోజుకు 300 నిమిషాలు సోషల్ మీడియా వాడే వారు డిప్రెషన్‌కు గురయ్యే అవకాశాలు ఇతరులతో పోలిస్తే ఎక్కువగా ఉన్నాయి.

Type-C Cable: చార్జింగ్ కేబుల్ కష్టాలకు చెల్లు.. ఇకపై అన్ని గాడ్జెట్లకు ఒకటే కేబుల్.. చట్టం చేసిన యురోపియన్ యూనియన్

ఇలాంటి వాళ్లలో ఎక్కువగా నెగెటివ్ ఆలోచనలు, యాంగ్జైటీ, కోపం వంటి భావాలు అధికంగా కనిపిస్తాయి. 18-30 ఏళ్ల వయసున్న దాదాపు వెయ్యి మందిని అధ్యయనం చేసి శాస్త్రవేత్తలు ఈ విషయాలు వెల్లడించారు.