Oxygen ATM: ‘ఆక్సిజన్ ఏటిఎం’..కరోనా కష్టంలో ఉచితంగా ప్రాణవాయువు

కరోనా కష్టంలో ఊపిరి అందక అల్లాడిపోతున్నవారికి ప్రాణవాయువుని అందించి ప్రాణాలు కాపాడుతోంది హెల్పింగ్​ హ్యాండ్స్​ అనే ఎన్​జీఓ. దేశంలో ఆక్సిజన్ కొరతతో ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితుల్లో ఉచితంగా ప్రాణవాయువుని అందించేందుకు ముందుకొచ్చింది హెల్పింగ్ హ్యాండ్స్.మెడికల్​ ఆక్సిజన్ అవసరమున్న రోగులు తమ పేరు, ఆధార్​ కార్డ్ నంబర్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్​ వివరాలను 9810083486 నంబర్​కు వాట్సాప్ మెసేజ్​ చేస్తే ఫ్రీగా ప్రాణవాయువుని అందిస్తోంది.

Oxygen ATM: ‘ఆక్సిజన్ ఏటిఎం’..కరోనా కష్టంలో ఉచితంగా ప్రాణవాయువు

Oxygen Atm

Oxygen ATM IN Delhi : కరోనా కష్టంలో ఊపిరి అందక అల్లాడిపోతున్నవారికి ప్రాణవాయువుని అందించి ప్రాణాలు కాపాడుతోంది హెల్పింగ్​ హ్యాండ్స్​ అనే ఎన్​జీఓ. దేశంలో ఆక్సిజన్ కొరతతో ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నవిషయం తెలిసిందే. ఈక్రమంలో ప్రాణవాయువుని అందించేందుకు ముందుకొచ్చింది హెల్పింగ్ హ్యాండ్స్. పేరుకు తగినట్లుగా తమ సహాయం హస్తాన్ని కరోనా బాధితులకు అందిస్తోంది. కరోనా బాధపడేవారికి మేమున్నామంటూ..మెడికల్​ ఆక్సిజన్ అవసరమున్న రోగులు తమ పేరు, ఆధార్​ కార్డ్ నంబర్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్​ వివరాలను 9810083486 నంబర్​కు వాట్సాప్ మెసేజ్​ చేస్తే ఫ్రీగా ప్రాణవాయువుని అందిస్తోంది. దీని కోసం..మెడికల్ ఆక్సిజన్ అవసరమైనవారి వివరాలను పరిశీలించి మెడికల్​ ఆక్సిజన్ అంజేస్తారు.​ ‘ఆక్సిజన్ ఏటీఎం’ను ఏర్పాటు చేసి..ప్రాణవాయువు అవసరమైనవారి వివరాలు తెలిపితే ఊపిరి పోస్తోంది.

దేశంలో కరోనా సెకండ్​ వేవ్​ ప్రభావం​ రాజధాని ఢిల్లీ ప్రాంతాల్లో భారీగా ఉంది. ఎంతగా ఉందంటే.. ఢిల్లీ ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్​ కాన్సంట్రేటర్ల కొరతతో రోగులు పిట్లల్లా రాలిపోతున్నంతగా ఉంది. దేశంలో పలు కరోనా దారుణ పరిస్థితులకు ఢిల్లీ ఏమాత్రం అతీతంగా లేదు.  ఈ పరిస్థితుల్లో ఆసుసత్రుల్లో బెడ్లు ఖాళీగా లేక ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వేలాది మంది కరోనా రోగులు ఆస్పత్రికంటే ఇల్లే బెటర్ అన్నట్లుగా హోమ్​ ఐసోలేషన్​లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో హెల్పింగ్​ హ్యాండ్స్​ ఢిల్లీలో ఫ్రీ ఆక్సిజన్ ఏటీఎంను ఏర్పాటు చేసింది.

హెల్పింగ్ హ్యాండ్ ఎన్​జీఓ సభ్యుడు రాబిన్ హిబు తన టీంతో కలిసి ఆక్సిజన్​ ఏటీఎం ఏర్పాటు చేశారు. హిబుతో పాటు కొంతమంది సిక్కు పౌరులు ఈ స్వచ్చంద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏటీఎం ద్వారా ఆక్సిజన్ రీఫిలింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాడు. రాబిన్​ హిబు బృందం ఈ ఆక్సిజన్​ ఏటీఎంను పశ్చిమ ఢిల్లీలోని సుభాష్ నగర్ వద్ద ఏర్పాటు చేసింది. మెడికల్​ ఆక్సిజన్ అవసరమున్న రోగులు తమ పేరు, ఆధార్​ కార్డ్ నంబర్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్​ వివరాలను 9810083486 నంబర్​కు వాట్సాప్ ద్వారా మెసేజ్​ చేయాల్సి ఉంటుంది. మీ వివరాలను పరిశీలించి మెడికల్​ ఆక్సిజన్ అంజేస్తారు.​

కాగా..ఆక్సిజన్ సర్వీసుల గురించి హిబు మాట్లాడుతూ “రోగులకు 4 నుండి -5 రోజుల పాటు అవసరయ్యే మెడికల్​ ఆక్సిజన్​ను అందిస్తున్నామనీ..ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే చిరుద్యోగులు, విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఈ ఆక్సిజన్​ ఏటీఎం ప్రారంభించిన మొదట్లో ఎటువంటి స్పందనా రాలేదనీ..కానీ తొమ్మిది రోజుల తరువాత..ఎంతో మంచి స్పందన వచ్చిందనీ..తమ సేవలు వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున రోగుల కుటుంబ సభ్యులు వస్తున్నారని తెలిపారు.

కాకపోతే చాలామంది గమనించాల్సిన విషయం ఏమిటంటే..ఆక్సిజన్ కోసం యత్నించి వారికి ఎక్కడా లభించకపోతే.. చివరి ప్రయత్నంగా మాత్రమే తమను సంప్రదించాలని కోరుతున్నారు. ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పేద రోగుల కోసం ఈ సర్వీసులను ప్రారంభించామని తెలిపారు.

కాగా, హెల్పింగ్ హ్యాండ్స్ సేవలను గుర్తించి.. దానికి మద్దతుగా ఒలింపియన్ బాక్సర్, రాజ్యసభ సభ్యులు..ప్రముఖ బాక్సర్ మేరీ కోమ్ రూ .3 లక్షలు విరాళంగా ఇచ్చారు. అంతేకాకుండా.. తన ఎంపీ లాడ్​ ఫండ్​ నుంచి మరింత సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. “ఈ ఆపత్కాలంలో ‘హెల్పింగ్​ హ్యాండ్స్’​ నిస్వార్థ సేవలకు కృతజ్ఞతలు చెబుతున్నానని..వారికి కావాల్సిన సహకారాన్ని అందజేస్తానని మేరీకోసం హామీ ఇచ్చారు. వారి సేవల్ని కొనియాడారు మణిపూర్ మణిపూస మేరీ కోమ్.